Elephants పాలెంలో ఏనుగుల బీభత్సం
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:53 PM
"Elephant Rampage in the Village కొమరాడ మండలం పాలెం పంచాయతీలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి, మంగళవారం వేకువ జామున ఎనిమిది ఏనుగులు గ్రామ పరిసరాల్లో సంచరించి గ్రామస్థులను హడలెత్తించాయి.
లబోదిబోమంటున్న రైతులు
జియ్యమ్మవలస, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం పాలెం పంచాయతీలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి, మంగళవారం వేకువ జామున ఎనిమిది ఏనుగులు గ్రామ పరిసరాల్లో సంచరించి గ్రామస్థులను హడలెత్తించాయి. 60 పామాయిల్ మొక్కలు, వరి, మొక్కజొన్న పంటలు, కూరగాయల తోటలు, పొలాల్లో బోరు పైపులను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమన్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తుంటే ఏనుగులు ధ్వంసం చేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారంతో అసలు పొలాలకు వెళ్లలేకపోతున్నామని వారు వాపోయారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించేలా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 11:53 PM