ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపే మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

ABN, Publish Date - May 17 , 2025 | 11:45 PM

Election of municipal chairman tomorrow బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ఈ నెల 19న సోమవారం ఎన్నిక జరగనుంది. గ

బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం

రేపే మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

రేసులో శరత్‌

బొబ్బిలి/ రూరల్‌, మే 17(ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ఈ నెల 19న సోమవారం ఎన్నిక జరగనుంది. గత నెల 29న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వైసీపీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన సొంత పార్టీకి చెందిన పది మంది కౌన్సిలర్లే అతన్ని వ్యతిరేకించారు. ఆపై టీడీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాసం ప్రకటించారు. ఈ క్రమంలో సుమారు నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు కొనసాగాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చూసేందుకు వైసీపీ పెద్ద నాయకులు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. చివరికి అధికార టీడీపీదే పై చేయి అయింది. 21 మంది అవిశ్వాసానికి అనుకూలంగా, 10 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గింది.

చైర్మన్‌ కుర్చీలో శరత్‌?

టీడీపీ బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావుల మధ్య చైర్మన్‌ పదవికి గట్టి పోటీ నెలకొంది. ఎవరి స్థాయిలో వారు తమ ప్రయత్నాలను పట్టు విడవకుండా కొనసాగిస్తున్నారు. అయితే శరత్‌ పేరు చైర్మన్‌ పదవికి ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. గత మున్సపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే గెంబలికి చైర్మన్‌ ఇవ్వాలనుకున్నారు. టీడీపీ గెలవకపోవడంతో ఆయనకు మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ పదవి ఇచ్చి అప్పట్లో సంతృప్తి పరిచారు. నాటి పరిస్థితులను తెరమీదకు తెస్తూ పార్టీ పెద్దలపై గెంబలి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో శరత్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - May 17 , 2025 | 11:47 PM