E-KYC 45వేల మందికి ఈకేవైసీ కాలే..
ABN, Publish Date - May 07 , 2025 | 11:53 PM
E-KYC could not for 45,000 People రేషన్ కార్డుల్లో అనర్హులను తొలగించి నిజమైన పేదలకు ఆహారభద్రత, ప్రభుత్వ రాయితీలను అందించడానికి ప్రభుత్వం ఈకేవైసీ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి 17న ఈ ప్రక్రియ చేపట్టగా.. తొలుత అదే నెల 31 వరకు గడువు విధించారు. ఆ తర్వాత దానిని గత నెల 30వరకు పొడిగించారు.
వచ్చే నెల 30 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం
రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు
సాలూరు రూరల్, మే 7(ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుల్లో అనర్హులను తొలగించి నిజమైన పేదలకు ఆహారభద్రత, ప్రభుత్వ రాయితీలను అందించడానికి ప్రభుత్వం ఈకేవైసీ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి 17న ఈ ప్రక్రియ చేపట్టగా.. తొలుత అదే నెల 31 వరకు గడువు విధించారు. ఆ తర్వాత దానిని గత నెల 30వరకు పొడిగించారు. అయితే జిల్లా పరిధిలో ఈ కార్యక్రమం 93 శాతం వరకు పూర్తయింది. దాదాపు 45 వేల మంది ఇంకా రేషన్ కార్డుల ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. సాలూరు, పాచిపెంట, భామిని, సీతంపేట మండలాలు బాగా వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం తాజాగా ఈకేవైసీ గడువును వచ్చే నెల 30 వరకు పొడిగించింది.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో 2.81 లక్షల రేషన్‌కార్డులున్నాయి. వాటిల్లో 8,16,859 మంది సభ్యులున్నారు. వారిలో 12,053 మంది ఐదేళ్లు లోపు పిల్లలు, 665 మంది 84 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉన్నారు. వారికి ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంది. మిగిలిన 8,04,141 మందిలో ఇప్పటి వరకు 7.59 లక్షల మందికి ఈకేవైసీ పూర్తయింది. మరో 45 వేల మందికి ఈకేవైసీ చేయాల్సి ఉంది. సాలూరు, పాచిపెంట, భామిని, సీతంపేట మండలాల్లో ఈ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాల్సి ఉంది.
- జిల్లాలో రేషన్‌కార్డులకు తగ్గట్టుగా ప్రతి నెలా 5,215 టన్నులకు పైబడి బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే చాలావరకు పేదల బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, చిల్లర వర్తకులు కార్డుదారుల నుంచి కేజీ బియ్యాన్ని రూ.14 నుంచి 16 చొప్పున కొనుగోలు చేసి రీస్లైకింగ్‌కు తరలిస్తున్నారు. ఆ తర్వాత వాటిని అధిక ధరకు ఒడిశాకు తరలిస్తున్నారు. జిల్లాలో 2022లో రూ. 23.72 లక్షలు, 2023లో రూ. 32.44 లక్షలు, 2024లో రూ. 14.77 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ అక్రమాకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీకి శ్రీకారం చుట్టింది.
ఎక్కడైనా చేసుకోవచ్చు..
రేషన్‌కార్డు ఈకేవైసీని రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. సమీప సచివాలయం, ఎండీయూ ( రేషన్ బండి ) వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు. జిల్లా నుంచి వలస వెళ్లిన వారు దీనిని గమనించాలి. రేషన్‌కార్డుల ఈకేవైసీలో మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 7.59 లక్షల మందికి ఈకేవైసీ పూర్తి చేశాం. నాలుగు మండలాలు వెనుబడి ఉన్నాయి. ఈకేవైసీ గడువు వచ్చే నెల 30 వరకు పొడిగించారు. క్షేత్రస్థాయి సిబ్బంది దీనిపై చొరవ చూపాలి. ఈ ప్రక్రియను శతశాతం పూర్తి చేయాలి.
- ఐ.రాజేశ్వరి, డీఎస్‌వో, పార్వతీపురం మన్యం
Updated Date - May 07 , 2025 | 11:53 PM