ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రాభివృద్ధికి కృషి

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:37 PM

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.

బొబ్బిలి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. గొల్లపల్లి అంబేడ్కర్‌ కాలనీలో రూ.90లక్షల ఎంపీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టను న్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు ఆదివారం శంకుస్థాపన చేశారు. గొల్లపల్లిలో ఎస్సీ నాయకుడు కాకల వెంకటరావు, వార్డు కౌన్సిలరు గోవిందమ్మ ఆధ్వ ర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులం తా ఎంపీ, ఎమ్మెల్యేలను సన్మానించారు. స్థానిక ఐదో వార్డులో తల్లికి వందనం లబ్ధిదారులతో ఎంపీ, ఎమ్మెల్యే లు ముఖాముఖి అయ్యారు. చిన్నారులంతా వారికి పుష్పగుచ్ఛాలు అందించి, స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి, వైస్‌చైర్మన్‌ చెలికాని మురళీకృష్ణ, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:37 PM