సులభంగా ప్లాన్ల మంజూరు
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:23 AM
సులభతరంగా, వేగవంతంగా ప్లాన్లను మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసినట్లు టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టరు పెనుగంటి నాయుడు చెప్పారు.
బొబ్బిలి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సులభతరంగా, వేగవంతంగా ప్లాన్లను మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసినట్లు టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టరు పెనుగంటి నాయుడు చెప్పారు. ఈ నేపథ్యంలోటౌన్ ప్లానింగ్ విభాగంలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. పట్టణ ప్రణాళికా విభాగంలో ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో అన్ని మునిసిపాలిటీల్లో అధికారులు, సిబ్బందికి, టౌన్‌ప్లాన్ సర్వే యర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం స్థానిక మునిసిపల్‌కౌన్సిల్ సమావేశ హాలులోకమిషనరు లాలం రామలక్ష్మి ఆధ్వర్యంలో అవ గాహన, సమీక్షా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యే కమైన సర్వేయరు పోస్టుతో పాటు అనేకమంది సిబ్బంది నియమితులుకావ డంతోకార్యకలాపాల నిర్వహణ సులభతరమవుతుందని చెప్పారు. పట్టణాల అభివృద్ధి కోసం తయారు చేసే మాస్టర్‌ప్లాన్‌లు విజన్ ఆఫ్‌డాక్యుమెంట్లని, వీటి ద్వారా ప్రణాళికా బద్దమైన అభివృద్ది జరుగుతుందన్నారు. సెల్ఫ్‌సర్టిఫికేషన్‌తో బిల్డింగ్ ప్లానులకు అనుమతులను కమిషనర్ల స్థాయిలో మంజూరు చేస్తున్నారన్నారు. అన్ని లేఅవుట్లకు తప్పనిసరిగా అనుమతి ఉండాలన్న లక్ష్యంతో 40 అడుగుల రోడ్ల నుంచి 30 అడుగు లకు నిబంధనలను సడలించారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీ లను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారన్నారు. మునిసిపాలిటీలకు ఆదాయం పెంచడమే లక్ష్యమన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల గడువు పూర్తయ్యేలోగా ఈ దరఖాస్తులన్నిటినీ పరిష్కరించాలన్నారు. పట్టణ ప్రణాళికా కార్యదర్శులు రెగ్యులర్‌గా ఆయా వార్డుల్లో పర్యటించి భవనాల నిర్మాణాలను పర్యవేక్షించాలన్నారు. అనుమతులు లేకుండా జరిగే నిర్మాణాలపై నిఘా పెట్టాలన్నారు. తాజాగా విడుదలైన భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంఽధనలపై ప్రజలకు పూర్తి స్థాయి అవగామన కల్పించడంతో లైసెన్స్‌డ్ ఇంజనీర్లు చొరవచూపాలని కోరారు. కార్యక్రమంలో డీటీసీపీఎం నాగలత పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:23 AM