Easier Approvals for Constructions నిర్మాణాలకు అనుమతులు సులభతరం
ABN, Publish Date - May 07 , 2025 | 11:51 PM
Easier Approvals for Constructions మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో లే అవుట్‌లతో పాటు వివిధ నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేయనున్నట్లు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి (ఆర్‌డీటీసీపీ) తెలిపారు.
పార్వతీపురం టౌన్, మే7(ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో లే అవుట్‌లతో పాటు వివిధ నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేయనున్నట్లు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి (ఆర్‌డీటీసీపీ) తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మున్సిపాల్టీలో బహుళ అంతస్తులు, వాణిజ్య సముదాయాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి ఆయా సచివాల యాల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. వాటికి మున్సిపల్ కమిషనర్ అనుమతులు తప్పనిసరి. నిర్మాణదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు సచివాలయాల ప్రణాళిక విభాగం అధికారులు సిద్ధంగా ఉండాలి. ఈ విభాగంలో టీపీవోతోపాటు నలుగురు అధికారులే ఉన్నారు. 55వేల మంది జనాభా కలిగిన పట్టణంలో ఇంకా అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది. 100 అడుగుల లోపు ఉన్న గృహ నిర్మాణాలకు ప్రణాళిక విభాగం అనుమతులు అవసరం లేదనేది అవాస్తవం. ఇక నుంచి భవన నిర్మాణ అనుమతులకు కమిషనర్లే కీలకం. మున్సిపల్ కమిషనర్, ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మధ్య కాలంలో జిల్లా కేంద్రంలో అక్రమ లే అవుట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటాం. ప్రణాళిక విభాగం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.’ అని తెలిపారు.
Updated Date - May 07 , 2025 | 11:51 PM