Tests Outside? టెస్ట్‌ల కోసం బయటకు పంపిస్తారా?
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:11 PM
Do You Send Tests Outside? వైద్య పరీక్షల కోసం చిన్న పిల్లలను బయటకు ఎలా పంపిస్తారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
బెలగాం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : వైద్య పరీక్షల కోసం చిన్న పిల్లలను బయటకు ఎలా పంపిస్తారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మంగళవారం పార్వతీపురం జిల్లాకేంద్ర ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. అనంతరం చిన్నపిల్లలు, డయాలసిస్ వార్డులను సందర్శించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. చిన్నపిల్లలకు ఏదైనా వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ క్లినిక్‌లకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకపై బయటకు పంపించడం మానేయాలన్నారు. ఆసుపత్రిలో ఇటువంటి సమస్యలు పునరావృతమైనా, రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:11 PM