ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delay Every Year..! ఏటా ఆలస్యమే..!

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:01 AM

Delay Every Year..! గిరిజన గురుకుల కళాశాలల్లో ఏటా ఆలస్యంగా సీట్లు పెంచడంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. వాస్తవంగా ఐటీడీఏ పరిధిలో ఇంటర్‌ విద్యకు అధిక డిమాండ్‌ ఉంది. కానీ పరిమిత సీట్లు ఉండడంతో మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు అవకాశం కల్పిస్తున్నారు. వాటి భర్తీ తరువాత ఆలస్యంగా సీట్లు పెంచుతుండడం వల్ల గిరిజన విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం ఉండడం లేదు.

సీతంపేటలోని ఏపీఆర్‌ బాలికల కళాశాల
  • ఇంకా భర్తీ కాని వైనం..

  • నేటితో తీరనున్న గడువు

  • విద్యార్థుల కోసం అన్వేషణ

సీతంపేట రూరల్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): గిరిజన గురుకుల కళాశాలల్లో ఏటా ఆలస్యంగా సీట్లు పెంచడంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. వాస్తవంగా ఐటీడీఏ పరిధిలో ఇంటర్‌ విద్యకు అధిక డిమాండ్‌ ఉంది. కానీ పరిమిత సీట్లు ఉండడంతో మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు అవకాశం కల్పిస్తున్నారు. వాటి భర్తీ తరువాత ఆలస్యంగా సీట్లు పెంచుతుండడం వల్ల గిరిజన విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం ఉండడం లేదు. అప్పటికే ప్రైవేట్‌ కళాశాలల్లో చేరిన వారు అక్కడ చదవలేక.. తిరిగి ఇక్కడకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజుల కిందట సీతంపేట బాలికల గురుకుల కళాశాలలో 30 వరకు అదనంగా ఇంటర్‌మీడియట్‌ సీట్లు పెంచారు. బైపీసీ 10, ఎంపీసీ 10, హెచ్‌ఈసీ గ్రూపులో 10 సీట్లను పెంచారు. అయితే కళాశాలలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెంచిన సీట్లు 50 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి. దీంతో మిగుల సీట్ల కోసం కళాశాల యాజమాన్యం విద్యార్థుల కోసం అన్వేషి స్తున్నారు. గతంలో కౌన్సిలింగ్‌కు హాజరైన విద్యార్థులను ఫోన్‌ల ద్వారా సంప్రదిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

ఐటీడీఏ పరిధిలో సీతంపేట బాలురు, బాలికలు, పెద్దమడి, మల్లి కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)తో కలిసి నాలుగు కళాశాలలున్నాయి. వాటి పరిధిలో సుమారు 480 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఏటా గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు అధిక డిమాండ్‌ ఉన్నా.. ఆ స్థాయిలో సీట్లు పెంచడం లేదు. దీంతో కౌన్సిలింగ్‌కు రావడం.. సీటు రాక నిరాశతో విద్యార్థులు వెనుదిరగడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఆర్థిక భారమైనా కొందరు మైదాన ప్రాంతాల్లోని ప్రైవేట్‌ కళాశాలల్లో చేరుతున్నారు. మరికొందరు చదువుపై ఆసక్తి ఉన్నా.. స్థోమత లేక డ్రాపౌట్లుగా మారుతున్నారు. ఏటా అనుకున్న గ్రూప్‌ల్లో సీట్లు లభించక ఇంకొంతమంది గిరిజన విద్యార్థులు ఇంటర్‌ విద్యకు దూరమవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధి కారులు స్పందించి గురుకుల కళాశాలల్లో సీట్లకు ఉన్న డిమాండ్‌ మేరకు ప్రవేశాలు కల్పించాలని గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో అదనంగా 30సీట్లు పెంచామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర చెప్పారు. కళాశాలల్లో ప్రవేశాలకు నేటి వరకు సమయం ఉన్నందున పెంచిన సీట్లన్నీ భర్తీ అవుతాయని తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 12:01 AM