ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dad, listen… I passed 10th grade! నాన్నా విను.. పది పాసయ్యా!

ABN, Publish Date - Apr 23 , 2025 | 11:29 PM

Dad, listen… I passed 10th grade! కేజీబీవీలో ఎంతో కష్టపడి చదివి ఆ విద్యార్థిని టెన్త్‌ పాసైంది. మంచి మార్కులు పొందింది. ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకుంది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫలితాలు వచ్చిన రోజే తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

భీముడు (ఫైల్‌)

తీవ్ర విషాదంలో కుమార్తె, కుటుంబ సభ్యులు

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భామిని, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కేజీబీవీలో ఎంతో కష్టపడి చదివి ఆ విద్యార్థిని టెన్త్‌ పాసైంది. మంచి మార్కులు పొందింది. ఈ విషయం తన తండ్రికి చెప్పాలనుకుంది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫలితాలు వచ్చిన రోజే తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన బుధవారం భామిని మండలంలో చోటుచేసుకుంది. బత్తిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే..

తాలాడ గ్రామానికి చెందిన గొర్లె భీముడు (52) పంచాయతీ గ్రీన్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడు, కూతురుతో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నాడు. కాగా మంగళవారం ఉదయం భీముడు వేరే పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన కోసం వాకబు చేశారు. అయితే వంశధార నది తీరంలో అచేతనంగా పడి ఉన్నట్టు తెలుసుకున్న వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే శరీరంలో పలు చోట్ల గాయాలు ఉండడంతో 108 వాహనం ద్వారా భీముడిని సీతంపేట ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బత్తిలి పోలీసులు సీతంపేట ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి సమయంలో భీముడు మృతి చెందాడు. మొదట్లో మద్యం తాగి స్పృహ కోల్పోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఒంటిపై గాయాలు ఉండడంతో ఎవరైనా దాడి చేసి హతమార్చి ఉంటారని సందేశించారు. ఈ మేరకు భీముడు భార్య ఫిర్యాదు చేయడంతో బత్తిలి ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తాలాడ గ్రామాన్ని సీఐ చంద్రమౌళి సందర్శించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భీముని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకిక దిక్కెవరని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రధానంగా కుమార్తె జి.లక్ష్మి తండ్రి మృతిని జీర్ణించుకోలేకపోతోంది. టెన్త్‌ పాసైన విషయాన్ని చెప్పలేకపో యాయని భోరున విలపించింది.

Updated Date - Apr 23 , 2025 | 11:29 PM