ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crossing the country దేశం దాటిస్తున్నారు

ABN, Publish Date - May 08 , 2025 | 12:07 AM

Crossing the country జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పశువులు అక్రమంగా తరలుతున్నాయి. కొన్ని జీవాలుగా.. ఇంకొన్ని మాంసం రూపంలో రవాణా అవుతున్నాయి. ఇతర రాష్ర్టాలు, దేశాలు దాటుతున్నాయి. ఈ తంతు ఓ పెద్ద మాఫియాలా మారింది. అందుకే సంవత్సరాలుగా సాగుతున్నా కట్టడి కావడం లేదు. మూగ జీవాలతో కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు.

దేశం దాటిస్తున్నారు

జిల్లా నుంచి తరలిపోతున్న పశువులు

సంతల్లో కొనుగోలు చేసి నేరుగా కబేళాలకు

వాహనాల్లోనూ ఆవులను కుక్కేసి తరలింపు

మాంసం రూపంలో విదేశాలకు ఎగుమతి

సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ వ్యాపారం

- దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం సంత ఉత్తరాంధ్రలోనే అతి పెద్దది. ఇక్కడకు ఒడిశాతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి సైతం పశువులను తెచ్చి విక్రయిస్తుంటారు. ప్రతి శనివారం జరిగే ఈ సంతలో సగటున కోటి రూపాయలకుపైగా క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. దళారులు కీలక ప్రాత పోసిస్తూ పెద్ద ఎత్తున పశువులను కబేళాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

- జామి మండలం అలమండలో వారపుసంత కూడా చాలా పెద్దది. సమీప మండలాల నుంచి రైతులు పశువులను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తుంటారు. వ్యవసాయ సీజన్‌ ముగిశాక పశువుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఇలా కొనుగోలు చేసిన పశువులు నేరుగా కబేళాలకు తరలుతుంటాయి.

జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పశువులు అక్రమంగా తరలుతున్నాయి. కొన్ని జీవాలుగా.. ఇంకొన్ని మాంసం రూపంలో రవాణా అవుతున్నాయి. ఇతర రాష్ర్టాలు, దేశాలు దాటుతున్నాయి. ఈ తంతు ఓ పెద్ద మాఫియాలా మారింది. అందుకే సంవత్సరాలుగా సాగుతున్నా కట్టడి కావడం లేదు. మూగ జీవాలతో కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. సంతల వద్ద కొనుగోలు చేసిన దగ్గర నుంచి విదేశాలకు తరలించే దాకా వివిధ చోట్ల ఆయా వ్యక్తుల ద్వారా ఈ దందా సాగుతోంది. విజయనగరంలో ఓ పెద్ద కబేళా నడుస్తోంది. ఇది కాకుండా విశాఖ, సామర్లకోట నుంచి కూడా పశుమాంసం అరబ్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది.

విజయనగరం, మే 7(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పశువుల రవాణా అక్రమ వ్యాపారానికి గ్రామీణ సంతలు అడ్డాగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో చాలాచోట్ల సంతలున్నాయి. పూసపాటిరేగ మండలంలో కందివలస గెడ్డ వద్దసంత జరుగుతోంది. దత్తిరాజేరు మండలంలోని పెద్దమానాపురంతో పాటు రాజాం, చీపురుపల్లి, అచ్యుతాపురం వంటి చోట్ల సంతలు నడుస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి సంతలకు వస్తున్న వారు దళారులను ఏర్పాటుచేసుకుంటున్నారు. సంతలను తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ప్రతి శనివారం పెద్దమానాపురంలో భారీగా పశువుల వ్యాపారం జరుగుతోంది. ఒడిశాలోని అప్సర, కోరాపుట్‌ తదితర సంతల నుంచి దళారులు వచ్చి పశువులను కొనుగోలు చేస్తారు. పార్వతీపురం, అలమండ, అచ్చుతాపురం సంతల్లో కొనుగోలు చేసిన పశువులను సైతం ఇక్కడికే తెస్తారు. ఒక్కో పశువును రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకూ విక్రయిస్తారు. ఆరోగ్యంగా ఉన్న పశువులు భారీ ధరకు అమ్ముడవుతాయి. ప్రతివారం జిల్లా నుంచి 8 వేల గోవులు తరలిపోతున్నాయి. పెద్దమానాపురంలో శనివారం ఉదయం కొనుగోలుచేసిన తరువాత రాత్రి వేళల్లో వాహనాల్లోకి ఎక్కించి రవాణా చేస్తున్నారు. విశాఖ, కాకినాడ, గొల్లప్రోలు, కత్తిపూడి, రాజమండ్రి, నూజివీడు ప్రాంతాలకు బలహీనంగా ఉన్న పశువులను తరలిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వాటిని చెన్నై, హైదరాబాద్‌, కేరళ రాష్ట్రాలకు తరలిస్తారు.

రవాణాలో మాయలు

రాజమండ్రి, జామి ప్రాంతాలకు చెందిన వారు పశువుల రవాణాలో ఆరితేరిపోయారు. రెండు అంతస్తుల్లో ఉన్న వాహనాలను కూడా పశువుల తరలింపునకు వినియోగిస్తున్నారు. సాధారణంగా 15-20 పట్టే వాహనాల్లో 60 నుంచి 70 పశువులను ఎక్కిస్తున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన తరువాత అవి గమ్యానికి చేరినట్టే. అక్కడ పశువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవు. ఇక్కడి పశు మాంసానికి అరబ్‌ దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. దేశీయంగా కిలో పశుమాంసం రూ.250 నుంచి రూ.450 పలుకుతోంది. కానీ అరబ్‌ దేశాల్లో రూ.6 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన పశువులను వధించి పోర్టులు, ఇతరత్రా అక్రమ మార్గాల్లో అరబ్‌ దేశాలకు చేరుతున్నట్టు తెలుస్తోంది.

ఎక్కడికక్కడే దళారులు..

జిల్లాలో పశువుల కొనుగోలు తంతులో దళారులే అంతా. కొనుగోలుదారుల విషయం బయటకు తెలియదు. రైతుల రూపంలో గ్రామాల్లోకి వస్తారు. పశువులను కొనుగోలు చేస్తారు. వాటిని రహస్య ప్రాంతాలకు తరలిస్తారు. రాత్రిపూట లారీలు, ఇతర వాహనాల్లో కుక్కి తరలిస్తుంటారు. మరికొందరైతే కంటైనర్లతో రహస్యంగా తరలించుకుపోతున్నారు.

దయనీయ స్థితిలో..

పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చునే వెసులబాటు ఉండాలి. ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహారం వేయడం లేదు. దీంతో ఆకలికి, దప్పికతో అలమటించే పశువులు మార్గమధ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా యంత్రాంగం నిద్రపోతోంది.

ప్రత్యేక దృష్టి

జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై దృష్టిపెట్టాం. అంతర్‌ రాష్ట్ర రహదారులతో పాటు గ్రామీణ రోడ్లలో సైతం తనిఖీలు ముమ్మరం చేశాం. అన్నిరకాల అనుమతులు, వ్యవసాయ పనుల నిమిత్తం తరలిస్తున్నారని తేలాకే విడిచిపెడుతున్నాం. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను నిలిపివేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలపై సైతం దృష్టిపెట్టాం. జిల్లా నుంచి పశు అక్రమ రవాణా జరుగకుండా అడుగడుగునా అడ్డుకుంటాం.

- వకుల్‌జిందాల్‌, ఎస్పీ, విజయనగరం

------------------------

Updated Date - May 08 , 2025 | 12:07 AM