కోర్టు భవనాలు నిర్మించాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:49 PM
కొత్తవలస కోర్టుకు సంబంధించి నూతన భవనాలను నిర్మించేందుకు సహకరించాలని స్థానిక న్యాయవాద సంఘం సభ్యులు కోరారు. శనివారం విజయనగరంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని న్యాయవాదసంఘం అధ్యక్షురాలు డీవీఎల్ దేవితోపాటుసభ్యులు కలిశారు.ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ కొత్తవలస కోర్టుకు సంబంధించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం న్యాయాధికారికి కేటాయించిన నివాస భవనంలో మూడేళ్లుగా కోర్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కొత్తవలస, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస కోర్టుకు సంబంధించి నూతన భవనాలను నిర్మించేందుకు సహకరించాలని స్థానిక న్యాయవాద సంఘం సభ్యులు కోరారు. శనివారం విజయనగరంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని న్యాయవాదసంఘం అధ్యక్షురాలు డీవీఎల్ దేవితోపాటుసభ్యులు కలిశారు.ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ కొత్తవలస కోర్టుకు సంబంధించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం న్యాయాధికారికి కేటాయించిన నివాస భవనంలో మూడేళ్లుగా కోర్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కోర్టుకు 1999లో నిర్మించిన భవనాలు శిథిలావ స్థకు చేరడంతో వెంటనే ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. దీంతో కోర్టుకు నూతన భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరుకోసం కృషి చేయాలని కోరగా న్యాయమూర్తి జస్టిస్ రవి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసే విధంగా కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు డీఎన్ రాజు, ఎంవీఎస్ గిరిబాబు, సీహెచ్‌ఆర్ ప్రసాద్, నందిపల్లి శ్రీరామమూర్తి,సత్యనారాయణ, వై.గణేష్‌నాయుడు, జి.మహేంద్ర, ఎన్.శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
నిఽధులు మంజూరు చేయాలి
శృంగవరపుకోట, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థలో ఉన్న శృం గవరపుకోట కోర్టు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని న్యాయవాదులు కోరారు.ఈమేరకు శనివారం విజయనగరంలో హైకార్టు న్యాయమూర్తి, జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు జి.సూరిదేముడు, కార్యదర్శి బీవీఎస్ రామారావు, ట్రెజరర్ బి.త్రిమూర్తులు, డబ్యూఎన్ శర్మ తదితరులు కలిశా రు. ఈ సందర్భంగా కోర్టు భవనాల కోసం జిల్లా ప్రధాన న్యాయాఽధికారి ద్వారా ఆర్‌అండ్‌బీకి పంపించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని న్యాయమూర్తి హామీఇచ్చారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు న్యాయాధికారుల నియామకానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకువెళ్లినట్లు చెప్పారు. కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరిం చారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:49 PM