Counseling for Teachers రాత్రి వరకూ టీచర్ల కౌన్సెలింగ్
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:33 AM
Counseling for Teachers Goes on Till Night ఎస్జీటీ బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి పది గంటల వరకు కొనసాగింది. ఉదయం సీరియల్ నెంబర్ 148 వరకు సజావుగానే ప్రక్రియ సాగింది. ఆ తర్వాత స్పౌజ్ కోటాలో పాఠశాల ఎంపిక విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కౌన్సెలింగ్ నిలిచిపోయింది.
సాలూరు రూరల్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ఎస్జీటీ బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి పది గంటల వరకు కొనసాగింది. ఉదయం సీరియల్ నెంబర్ 148 వరకు సజావుగానే ప్రక్రియ సాగింది. ఆ తర్వాత స్పౌజ్ కోటాలో పాఠశాల ఎంపిక విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఈ విషయమై సీఎస్‌ఈ నుంచి స్పష్టత రావడంతో మళ్లీ కౌన్సెలింగ్ పునఃప్రారంభమైంది. సీరియల్ నెంబర్ 1 నుంచి 800 వరకు కౌన్సెలింగ్ జరపాలని తొలుత భావించారు. సమయాభావం వల్ల సీరియల్ నెంబర్ 1 నుంచి 500 వరకు కౌన్సెలింగ్ చేపట్టారు. పలువురు తమకు నచ్చిన ప్రాంతాల్లో పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు.
Updated Date - Jun 12 , 2025 | 12:33 AM