Teacher Transfers ఐటీడీఏలో టీచర్ల బదిలీలకు కౌన్సిలింగ్
ABN, Publish Date - May 30 , 2025 | 11:23 PM
Counseling for Teacher Transfers in ITDA సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం టీచర్ల బదిలీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇన్‌చార్జి పీవో సి యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవో, స్కూల్ అసిస్టెంట్లు, నాలుగో తరగతి ఉద్యోగులంతా హాజరయ్యారు.
సీతంపేట రూరల్, మే 30(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం టీచర్ల బదిలీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇన్‌చార్జి పీవో సి యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవో, స్కూల్ అసిస్టెంట్లు, నాలుగో తరగతి ఉద్యోగులంతా హాజరయ్యారు. మొదటి విడతలో 88 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారితో పాటు నలుగురు హెచ్‌డబ్ల్యూవోలు, ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించి నిబంధనల ప్రాప్తికి బదిలీలు చేపట్టారు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీ చేశారు. రెండేళ్లు దాటి పనిచేసిన వారికి ప్రాధాన్య క్రమంలో నిబంధనలకు అనుసరించి స్థాన చలనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, డీడఈ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఏఎంవో కోటిబాబు, జీసీడీవో రాములమ్మ, గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:23 PM