ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:09 AM

అన్ని రాజకీయ పార్టీలు తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడానికి సహకరించాలని బొబ్బిలి ఆర్డీవో జీవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు కోరారు. మంగళవారం బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమేవేశం నిర్వహించారు. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలు, నివేదికను ఈడీటీ గౌరిశంకరరావు వివరించారు.

మాట్లాడుతున్న రామ్మోహనరావు:

బొబ్బిలి రూరల్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): అన్ని రాజకీయ పార్టీలు తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడానికి సహకరించాలని బొబ్బిలి ఆర్డీవో జీవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు కోరారు. మంగళవారం బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమేవేశం నిర్వహించారు. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలు, నివేదికను ఈడీటీ గౌరిశంకరరావు వివరించారు. అనంతరం రామ్మోహన రావు మాట్లాడుతూ బొబ్బిలి ఏసీలో ఉన్న 264 పోలింగ్‌ కేంద్రాలకు ప్రతి పీఎస్‌కి ఒక బీఎల్‌ఓను నియమించినట్లు తెలిపారు. వీరి ద్వారా ప్రతి పీఎస్‌లో ఓటర్‌ లిస్టులను శతశాతం తప్పులు లేకుండా తయారుచేయడంతో పాటు అర్హులైన ఓటర్లను చేర్చుకోవడం, నమోదు చేయనున్నట్లు చెప్పారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఎం ప్రతినిధులు టి.ఈశ్వరరావు, ఎన్‌.సత్యారావు, డీఎస్‌ కుమార్‌, ఎస్‌. గోపాలం, పి.శంకరరావు పాల్గొన్నారు.

ఇంటి వద్ద రేషన్‌ పంపిణీ

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్‌ సరుకులు పంపిణీ చేయ నున్నట్లు ఆర్డీవో జీవీఎస్‌ఎస్‌ రామ్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ కార్డులో ఒంటరిగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, బెడ్‌రిడెన్‌ లబ్ధిదా రులకు సంబందించి వాట్స్‌ ఆప్‌ గ్రూప్‌, మిగిలిన కార్డుదారులతో కూడా ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని రేషన్‌ డీలర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రేషన్‌ డీలర్లే వారికి ఇంటి వద్ద రేషన్‌ సరుకులు అందజేయాలని సూచించారు. రేషన్‌ పంపిణీలో కార్డుదారులకు ఇబ్బంది కలిగించే రీతిలో వ్యవహరించిన డీలర్లపై చర్యలు తీసుకొని పంపిణీ బాధ్యతలను వీఆర్వోలకు అప్పగిస్తామని హెచ్చరించారు.

Updated Date - Jun 04 , 2025 | 12:09 AM