Fever Survey పక్కాగా జ్వరాల సర్వే
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:35 PM
Comprehensive Fever Survey జ్వరపీడితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం దబ్బగెడ్డ గ్రామంలో పర్యటించారు. కాలువలు, ఇంటి పరిసరాలను పరిశీలించారు. జ్వరాలు ప్రబలడానికి గల కారణాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
మక్కువరూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జ్వరపీడితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం దబ్బగెడ్డ గ్రామంలో పర్యటించారు. కాలువలు, ఇంటి పరిసరాలను పరిశీలించారు. జ్వరాలు ప్రబలడానికి గల కారణాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. లేకుంటే వర్షాకాలంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎంతమంది జ్వరాలతో బాధపడుతున్నారు? వారికి అందించిన వైద్యసేవల వివరాలను అడిగితెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం చేపట్టే డ్రైడే, పారిశధ్య కార్యక్రమాలు, తాగునీటి పరీక్షలు చేసే విధానంపై ఆరా తీశారు. జ్వర లక్షణాలున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వేను చేపట్టి నివేదికలు అందించాలని సూచించారు. ఆ తర్వాత ఆయన మక్కువ పీహెచ్‌సీని సందర్శించారు. ఓపీ వివరాలు, రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డీపీఎంవో రఘుకుమార్, జిల్లా మలేరియా అధికారి మణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 11:35 PM