ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కుమార్తె కనిపించడంలేదని ఫిర్యాదు

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:56 AM

కుమార్తె కనిపించలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ బుధవారం కేసు నమోదు చేశారు.

కొత్తవలస, జూన్‌11 (ఆంధ్రజ్యోతి): కుమార్తె కనిపించలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ బుధవారం కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మండలంలోని చింతలపాలెం పంచాయతీ తాడివానిపాలెం గ్రామానికి చెందిన రాయల అనిత (21) తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన చేశెట్టి వెంకట సురేంద్ర ప్రేమించి 2023 సెప్ట్టెంబర్‌ 30న వివాహం చేసుకున్నారు. వీరు ఇరువురు ఏడాది పాటు పాటు హైదరాబాద్‌లో కాపురం చేశారు. తర్వాత అక్కడ సురేంద్ర ఉద్యోగం మానేశాడు. మళ్లీ విజయవాడలో ఉద్యోగం కోసమని భార్యను., అనిత తల్లితండ్రులు ఇంటి వద్ద తాడివానిపాలెంలో ఉంచి సురేంద్ర వెళ్లాడు. విజయవాడలో సురేంద్రకు ఉద్యోగం రావడంతో తన భార్యను విజయవాడ పంపించాలని అత్తామామలకు చెప్పాడు. దాంతో వారు గతనెల 7న విజయవాడ వెళ్లేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌లో అనితను ఎక్కించారు. అయితే తన భార్య విజయవాడ రాలేదని సురేంద్ర చెప్పడంతో అప్పటి నుంచి వెతుకుతున్నారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో అనిత తల్లి సూరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - Jun 12 , 2025 | 12:56 AM