ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Collect to Earn! సేకరిస్తే ఆదాయమే!

ABN, Publish Date - May 10 , 2025 | 11:17 PM

Collect to Earn! జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు (బీడీ ఆకు)కు ఎంతో గిరాకీ ఉంది. వరంగల్‌ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రవాణా అయ్యేది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఎగుమతి చేసేవారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది వ్యాపారులు ఇక్కడకు వచ్చి వాటిని కొనుగోలు చేసేవారు. తద్వారా అటవీశాఖకు ఆదాయం వచ్చేది. మరోవైపు ఏటా వేసవిలో గిరిజనులు కూడా వాటిని సేకరించి ఉపాధి పొందేవారు.

వంజరాపుగూడలో తునికాకు
  • అటవీశాఖకూ లాభమే..

  • వైసీపీ పాలనలో నిలిచిన వైనం

  • రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నపం

గుమ్మలక్ష్మీపురం, మే10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు (బీడీ ఆకు)కు ఎంతో గిరాకీ ఉంది. వరంగల్‌ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రవాణా అయ్యేది. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఎగుమతి చేసేవారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది వ్యాపారులు ఇక్కడకు వచ్చి వాటిని కొనుగోలు చేసేవారు. తద్వారా అటవీశాఖకు ఆదాయం వచ్చేది. మరోవైపు ఏటా వేసవిలో గిరిజనులు కూడా వాటిని సేకరించి ఉపాధి పొందేవారు. గతంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, మక్కువ, పాచిపెంట, సాలూరు తదితర గిరిజన మండలాల్లో వాటి సేకరణ జరిగేది. గిరిజనులకు రోజుకు రూ.300 వరకు కూలి వచ్చేది. కుటుంబంలో ఇద్దరు కష్టపడితే రూ.600 వరకు వచ్చేది.

ఏటా టెండర్లు..

అటవీశాఖ ఏటా వేసవిలో తునికాకు సేకరణకు టెండర్లు పిలిచేది. ఈ టెండర్‌ పొందిన వారు గిరిజనులకు సేకరణ పనులు అప్పగించేవారు. దీంతో వారు ఉదయాన్నే బీడీ ఆకును సేకరించి ఇంటికి తీసుకొచ్చేవారు. మధ్యాహ్నం వేళ 50 ఆకుల చొప్పున కట్టలు కట్టి కల్లాలకు తీసుకెళ్లి రూపాయి చొప్పున వ్యాపారులకు విక్రయించేవారు. టెండర్లు దక్కించుకున్న వారు ప్రతి గ్రామంలో కల్లాలు ఏర్పాటు చేసి వాటిని ఆరబెట్టేవారు. ఇందుకు గాను గిరిజన యువతకు ప్రతినెలా రూ.3వేలు ఇచ్చేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. బీడీ ఆకు సేకరణ నిలిచిపోయింది. దీంతో గిరిజన కూలీలు ఆదాయం కోల్పోయారు.

ఇదే అనువైన సమయం..

వాస్తవంగా మే, జూన్‌, జూలై నెలల్లో తునికాకు సేకరణకు అనువుగా ఉంటుంది. సకాలంలో ఆకు సేకరిస్తే అటవీశాఖకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం రానుంది. గిరిజనులకు రోజుకు రూ. 500 కూలి వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి.. అటవీశాఖ ద్వారా బీడీ ఆకు సేకరణ చేపట్టాలని గిరిజన కూలీలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనిపై ఫారెస్ట్‌ రేంజర్‌ గంగరాజును వివరణ కోరగా.. ‘ఇప్పటివరకు కురపాం రేంజ్‌ పరిధిలో తునికాకు కొనుగోలుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వస్తే తగిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 11:17 PM