ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coconut Cultivation ఐదు వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కల పెంపకం

ABN, Publish Date - May 09 , 2025 | 11:36 PM

Coconut Cultivation in 5,000 Acres ఉపాధి హామీ నిధులతో జిల్లాలోని ఐదు వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు పెంపకానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రహదారులకు ఆనుకుని కొబ్బరి మొక్కలు నాటారు. పర్యవేక్షణ లోపంతో అంతంత మాత్రంగానే వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి ఉపాధి, వెలుగు అధికారులు పకడ్బందీగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

సుంకిలో మొక్కలు నాటేందుకు సిద్ధమైన చెరువు గట్టు

గరుగుబిల్లి, మే 9(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ నిధులతో జిల్లాలోని ఐదు వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు పెంపకానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రహదారులకు ఆనుకుని కొబ్బరి మొక్కలు నాటారు. పర్యవేక్షణ లోపంతో అంతంత మాత్రంగానే వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి ఉపాధి, వెలుగు అధికారులు పకడ్బందీగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. 15 మండలాల పరిధిలోని 450 పంచాయతీల్లో చెరువులు, రిజర్వాయర్ల ప్రాంతాలు, ప్రభుత్వ భూములు (ఖాళీగా ఉన్నవి), పాఠశాలల ఆవరణల్లో నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చెరువు ప్రాంతాల్లో ఐదు మీటర్లకు ఒక మొక్కను ఏర్పాటు చేసే విధంగా మండలాలవారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మండలానికి సంబంధించి సుమారు ఐదు వేలకు పైగా కొబ్బరి మొక్కల అవసరం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. మొక్కలకు సంబంధించి ఉపాధి నిధులు వెచ్చించనున్నారు. మొక్కల కొనుగోలు, గోతులు తవ్వడంతో పాటు పలు రకాల పనుల బాధ్యత ఉపాధి సిబ్బందికి అప్పగించారు. నాటిన మొక్కల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలోని గ్రామైక్య సంఘాలకు అప్పగించున్నారు. ఈ మేరకు గ్రామస్థాయిలో వీవోలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే సీతంపేట క్లస్టర్‌ పరిధిలోని ఐదు మండలాల్లో కొబ్బరి మొక్కలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ప్రతిపాదనలు సిద్ధం

జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో కొబ్బరి మొక్కలు పెంపకానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయనున్నాం. 300 మీటర్ల మేర ఉన్న చెరువులను గుర్తించాం. మండలాల పరిధిలో చెరువులను గుర్తించే బాధ్యత ఏపీవోలకు అప్పగించాం. క్లస్టర్‌ పరిధిలోని ఏపీవోలకు అవసరమైన సూచనలు చేశాం. సమాచార సేకరణ పూర్తయింది. మండలంలో ఐదు వేలకు పైగా మొక్కలు కేటాయించనున్నాం. ఉపాధి సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చేందుకు చర్యలు చేపడుతున్నాం. అనుమతులు రాగానే కార్యక్రమం ప్రారంభమ వుతుంది. నిర్వహణలో లోపాలు ఉన్నట్లయితే సంబంధిత ఉపాధి సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు చేపడతాం.

- కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా

Updated Date - May 09 , 2025 | 11:36 PM