ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపేదలకు సంజీవనిగా సీఎంఆర్‌ఎఫ్‌

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:13 AM

ఎంతోమంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు.

  • ఎమ్మెల్యే కోండ్రు

రాజాం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఎంతోమంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన రూ.3లక్షల 99వేల 827 విలువ చేసే చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. రాజాం ఇందిరమ్మ కాలనీకి చెందిన బొంగు వెంకటరమణమ్మకు రూ.76,714, సత్యనారాయణపురానికి చెందిన వి.శ్రీనివాసరావుకు రూ.లక్షా 1128, సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన గంటా రవికుమార్‌కు రూ.లక్షా 27వేల 891, గోళవలసకు చెందిన వావిలపల్లి రమేష్‌కు రూ.94వేలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు.

రాజాం అమ్మవారి కాలనీకి చెందిన వారణాసి స్పందన అనే మహిళ క్యాన్సర్‌తో బాధపడుతోందని పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన స్పందించి, ఆమె కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు, గురవాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజాం నూతన ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గం ఎమ్మెల్యేని కలిసి వారి సమస్యలు వివరించారు.

Updated Date - Jul 23 , 2025 | 12:13 AM