Fever జ్వరాల పంజా
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:35 PM
Clutches of Fever సీతంపేట మన్యంలో జ్వరాలు పంజా విసురు తున్నాయి. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఏ గ్రామంలో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఒక్కో ఇంట్లో ఒక్కరు లేక ఇద్దరు బాఽధితులు ఉంటున్నారు. ఎక్కువగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
సీతంపేట రూరల్, జూన్30(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో జ్వరాలు పంజా విసురు తున్నాయి. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఏ గ్రామంలో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఒక్కో ఇంట్లో ఒక్కరు లేక ఇద్దరు బాఽధితులు ఉంటున్నారు. ఎక్కువగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సోమవారం సీతంపేట ఏరియా ఆసుపత్రిలో 318 వరకు ఓపీ నమోదైంది. వారిలో 90 మంది జ్వరపీడితులు ఉన్నారు. మలేరియా ఆర్‌డీటీ పాజిటివ్ 26, స్లైడ్ పాజిటివ్ 3 కేసులు వచ్చాయి. 46మంది ఇన్‌పేషెంట్లుగా చేరి వైద్యసేవలు పొందుతున్నారు. ఏరియా ఆసుపత్రి పై అంతస్తులో చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేకంగా ఓ వార్డును వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో రోగులకు కొంత మేర వసతి సమస్య తీరింది.
Updated Date - Jun 30 , 2025 | 11:35 PM