ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RMP ఆర్‌ఎంపీకి దేహశుద్ధి

ABN, Publish Date - Apr 09 , 2025 | 11:39 PM

Cleansing for the RMP మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌ ద్వారా వీడియోలు తీసిన ఓ ప్రైవేట్‌ క్లీనిక్‌ వైద్యునికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బుధవారం పార్వతీపురం పట్టణంలో చోటుచేసుకుంది.

చితకబాదిన స్థానికులు

కేసు నమోదు చేసిన పోలీసులు

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌ ద్వారా వీడియోలు తీసిన ఓ ప్రైవేట్‌ క్లీనిక్‌ వైద్యునికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బుధవారం పార్వతీపురం పట్టణంలో చోటుచేసుకుంది. దీనిపై టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఆర్‌ఎంపీ బి.సర్కార్‌ పట్టణంలోని రాయగడ రోడ్డులో ఫైల్స్‌ క్లీనిక్‌ నిర్వహిస్తున్నాడు. రెండు నెలల కిందటే దీనిని ఏర్పాటు చేశారు. అయితే పరిసర ప్రాంతాల్లో మహిళలు స్నానాలు చేస్తుండగా ఈ వైద్యుడు క్లీనిక్‌ మేడపై నుంచి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసేవాడు. బుధవారం కూడా అదే పని చేయగా స్థానికులు గుర్తించి ఆర్‌ఎంపీకి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సర్కార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతవాసుల ఫిర్యాదు మేరకు సీఐ మురళీధర్‌ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు.

Updated Date - Apr 09 , 2025 | 11:39 PM