ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:14 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

బాధితులకు చెక్కులను అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి
  • మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరులోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆమె ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పాచిపెంటకు చెందిన దుమ్మరి వంశీకృష్ణకు రూ.42,276, మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన డాకేటి లక్ష్మికి రూ.31,019 మంజూరు కాగా, ఆ చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు.

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మార్కొండదేవికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే జగదీశ్వరి శుక్రవారం గుమ్మలక్ష్మీపురం లోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మార్కొండదేవి అనారో గ్యానికి గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.40,960 ఆర్థిక సాయం అందేలా కృషి చేశారు. ఈ చెక్కు ను ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ కడ్రక కళావతి, ఎంపీటీసీ సింహాచలం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:14 AM