ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Causing a Stir దడ పుట్టిస్తున్నాయ్‌!

ABN, Publish Date - May 18 , 2025 | 11:27 PM

Causing a Stir పల్లె, పట్టణం అనే తేడా లేకుండా .. ఎక్కడైనా ఏ శుభకార్యమైనా డీజే సౌండ్‌ సిస్టం వినియోగం తప్పనిసరి అయింది. ప్రస్తుత రోజుల్లో అది లేనిదే.. ఏ కార్యక్రమమైనా ముందుకు నడవడం లేదు. డీజే సిస్టంకు ఒక రోజుకు రూ.50 వేలు నుంచి రూ.లక్షా 50 వేలకు వసూలు చేస్తున్నారు. కాగా డీజేల ముందు సరదాగా డ్యాన్సులు చేసే వారు.. ఈ సందడి వెనుక పెను ప్రమాదం ఉందని ఎవరూ గ్రహించడం లేదు.

  • అధిక శబ్దాలతో అనేక ఇబ్బందులు

  • సరదా మాటున మృత్యువును కొనితెచ్చుకుంటున్న వైనం

  • చోద్యం చూస్తున్న యంత్రాంగం

పాలకొండ, మే18(ఆంధ్రజ్యోతి): పల్లె, పట్టణం అనే తేడా లేకుండా .. ఎక్కడైనా ఏ శుభకార్యమైనా డీజే సౌండ్‌ సిస్టం వినియోగం తప్పనిసరి అయింది. ప్రస్తుత రోజుల్లో అది లేనిదే.. ఏ కార్యక్రమమైనా ముందుకు నడవడం లేదు. డీజే సిస్టంకు ఒక రోజుకు రూ.50 వేలు నుంచి రూ.లక్షా 50 వేలకు వసూలు చేస్తున్నారు. కాగా డీజేల ముందు సరదాగా డ్యాన్సులు చేసే వారు.. ఈ సందడి వెనుక పెను ప్రమాదం ఉందని ఎవరూ గ్రహించడం లేదు. అధిక శబ్దంతో వారితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాస్తవంగా డీజే సౌండ్స్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. శుభకార్యం, వివాహ వేడుక, సంబరాలు, జాతరలు, ఉత్సవాలు, ర్యాలీలు ఏదైనా చేపట్టే క్రమంలో డీజే పెట్టాలంటే అనుమతులు తప్పనిసరి కానీ అత్యధికులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టాను సారంగా డీజే సౌండ్‌ బాక్సులను వినియోగించి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అయినా దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు. డీజేల ధాటికి ఇళ్లలో సామాన్లు సైతం అదురు తుండగా.. చిన్నారులు, వృద్ధులు గుండె దడతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు గుండె పోటుకు గురవుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. నాలుగు రోజుల కిందట పాలకొండ మండలం భాసూరు గ్రామంలో ఓ వ్యక్తి శుభకార్యం డీజే పాటలకు స్టెప్పులేస్తూ.. కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా జిల్లాలో చాలాచోట్ల జరుగుతున్నా.. అధికారులు డీజే సౌండ్‌లను కట్టడి చేయలేకపోతున్నారు.

ఆరోగ్య సమస్యలు అధికం

ఆరోగ్యంగా ఉండే వ్యక్తి 45 నుంచి 55 డిజిబుల్స్‌ శబ్దాన్ని మాత్రమే వినాలి. అంతకు మించి శబ్దం వింటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆందోళన, అధిక రక్తపోటు, గుండెపోటుతో పాటు నాడీ మండలంపై ఒత్తిడి పెరగనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏ డీజే సౌండ్‌ పరిశీలించినా వంద నుంచి 150 డిజిబుల్స్‌ సౌండ్స్‌ వచ్చేలా వినియోగిస్తున్నారు. దీంతో ప్రజారోగ్యంపై ఈ ప్రభావం అధికంగానే కనిపిస్తుంది. ఒక వ్యక్తి రెండు గంటలు కంటే ఎక్కువ సమయం డీజే ముందు ఉంటే ఇప్పటికిప్పుడే అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు. భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్యానికిగురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చోద్యం చూస్తున్న యంత్రాంగం...

వాస్తవంగా డీజే సౌండ్‌ వినియోగంపై నిషేధం ఉంది. శుభకార్యాల్లో వాటిని వినియోగిం చాలంటే పోలీస్‌శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. అయితే అత్యధిక శాతం మంది అలా చేయడం లేదు. ఇష్టానుసారంగా డీజేలను వినియోగిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉన్నా.. శబ్ద కాలుష్య నియంత్రణ మండలితో పాటు వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాగమంతా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుని ప్రజారోగ్యం కాపాడాలని జిల్లావాసులు కోరుతున్నారు. యువత సరదా మాటున డీజే ముందు నృత్యాలు చేస్తూ అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

అనుమతులు తప్పనిసరి..

శుభకార్యాలకు డీజే సౌండ్స్‌ సిస్టమ్‌ వినియోగించే వారు విధిగా పోలీస్‌శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. నిబంధనలకు విరుద్ధంగా డిజిబుల్స్‌ సౌండ్‌ను అధికంగా పెంచితే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజారోగ్యంపై శబ్దకాలుష్య ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని డీజే సౌండ్‌ సిస్టమ్‌ను వినియోగించాలి.

- ఎం.చంద్రమౌళి, సీఐ

Updated Date - May 18 , 2025 | 11:27 PM