Caught with marijuana గంజాయితో దొరికిపోయారు
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:58 PM
Caught with marijuana ఒడిశా నుంచి తీసుకొస్తున్న గంజాయిని జిల్లా దాటిస్తుండగా పోలీసులు కనిపెట్టి అడ్డుకున్నారు. రవాణాదారుల వ్యూహాన్ని బోల్తా కొట్టించారు. విజయనగరం ట్యాంకుబండ్ రోడ్డులో అడ్డగించి 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
గంజాయితో దొరికిపోయారు
ఢిల్లీకి తరలింపునకు వ్యూహం
ఏడుగురి అరెస్టు
46 కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైం, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి తీసుకొస్తున్న గంజాయిని జిల్లా దాటిస్తుండగా పోలీసులు కనిపెట్టి అడ్డుకున్నారు. రవాణాదారుల వ్యూహాన్ని బోల్తా కొట్టించారు. విజయనగరం ట్యాంకుబండ్ రోడ్డులో అడ్డగించి 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాదు మీదుగా ఢిల్లీకి చేర్చాలనేది వారి ప్రణాళిక. నిందితుల నుంచి ఆటో, పల్సర్ బైక్, ఐదు సెల్‌ఫోన్లు, రూ.8 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వకుల్‌జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆ వివరాలను వెల్లడించారు.
గంజాయి రవాణాపై విజయనగరం వన్‌టౌన్ పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందడంతో ట్యాంకు బండ్ రోడ్డులోని ఎల్‌ఐసీ బిల్డింగ్ సమీపంలో గురువారం తనిఖీలు చేపట్టారు. ఆటోలో గంజాయి తీసుకొస్తున్నట్లు తెలియడంతో అటుగా వచ్చే ప్రతి ఆటోనూ సోదా చేశారు. ఏపీ 39 ఎంయు 6259 నంబరు ఆటోను కూడా అడ్డుకుని తనిఖీ చేశారు. ఆటోలో ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 46 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పడాలపుట్ గ్రామానికి చెందిన చందక శ్రీను, హుకుంపేట మండలం సిమిలిగూడ లంగశీల పంచాయతీకి చెందిన చొంపి దివాకర్, అదే పంచాయితీకి చెందిన చొంపి కళ్యాణ్, కొర్రా గ్రామానికి చెందిన తంగుల కిరణ్‌కుమార్, రంగశీల పంచాయతీకి చెందిన చొంపి సన్యాసిరావు, కాకినాడ జిల్లా శంఖవరం మండలం గౌరమ్ పేట గ్రామానికి చెందని పిళ్లా శివ, కాకినాడ జిల్లా పరమలయ్యపేటకు చెందిన పిళ్లా కమలాకర్‌లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరికి ముందు పైలట్‌గా పడాలపుట్‌కు చెందిన చందక శ్రీను వెళ్లాడు. ఆయన గంజాయిని తరలించేందుకు ఒప్పందం కుదిర్చి ఒక్కొక్కరికి మూడు వేలు ఇచ్చినట్టు విచారణలో నిందితులు వెల్లడించారని ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. పరారీలో ఉన్న పెద్దబయలుకు చెందిన రాంబాబును అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి, ఎస్‌ఐలు సురేంద్రనాయుడు, రామ్‌గణేష్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:58 PM