ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Carried in a Doli... డోలీ కట్టి.. 5 కిలోమీటర్లు నడిచి..

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:16 PM

Carried in a Doli... Walked 5 Kilometres... గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్యసేవలు పొందేందుకు కొండలు, రాళ్లు రప్పలు దాటి ఆసుపత్రికి చేరుకోవాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకు రహదారులు, పీహెచ్‌సీలు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.

ఆశా వర్కర్‌ను డోలీలో ఎగువ కాషాయవలస నుంచి కొండ దించుతున్న బంధువులు
  • కొండలు, రాళ్లు రప్పలు దాటి ఆస్పత్రికి చేరిన వైనం

సాలూరు రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్యసేవలు పొందేందుకు కొండలు, రాళ్లు రప్పలు దాటి ఆసుపత్రికి చేరుకోవాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకు రహదారులు, పీహెచ్‌సీలు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. సాలూరు మండలంలో గిరిశిఖర గ్రామం ఎగువ కాషాయవలసకు చెందిన ఆశా వర్కర్‌ కూనేటి శ్యామల జ్వరం, వాంతులు, విరేచనాలతో బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. మధ్యాహ్నం తర్వాత అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు డోలీ కట్టారు. ఆమెను అందులో కూర్చొబెట్టి.. కొండలు కోనల్ని దాటి.. ఐదు కిలోమీటర్లు నడిచి కురుకూటికి వెళ్లారు. అక్కడ నుంచి జీపును అద్దెకు తీసుకున్నారు. దాని ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు స్పందించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

కురుకూటిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి

ఎగువ కాషాయవలసతో మరికొన్ని గిరిశిఖర గ్రామాల కోసం కొండ దిగువన ఉన్న కురుకూటిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని సీపీఎం నేత శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామారావు కోరారు. సుదూరంగా తోణాం పీహెచ్‌సీకి గిరిశిఖర గ్రామాలన్నీ మ్యాపింగ్‌ అయ్యి ఉన్నాయని తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదన్నారు. అదేవిధంగా గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 11:16 PM