Irrigation Water? కాలువ ఇలా.. సాగునీరు ఎలా?
ABN, Publish Date - Jun 01 , 2025 | 11:36 PM
Canals in This State... What About Irrigation Water? జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల నుంచి ఖరీఫ్‌కు సాగునీరు అందడం ప్రశ్నార్ధకంగా మారింది. కాలువల్లో అధికంగా గుర్రపు డెక్కతో పేరుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో వారంతా నారుమళ్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అయితే సాగునీటి సరఫరాకు సంబంధించి ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పేలా లేవని ఆవేదన చెందుతున్నారు.
గరుగుబిల్లి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల నుంచి ఖరీఫ్‌కు సాగునీరు అందడం ప్రశ్నార్ధకంగా మారింది. కాలువల్లో అధికంగా గుర్రపు డెక్కతో పేరుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో వారంతా నారుమళ్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అయితే సాగునీటి సరఫరాకు సంబంధించి ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పేలా లేవని ఆవేదన చెందుతున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు నుంచి పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం, మక్కువ మండలాల్లో సుమారు 75 గ్రామాల్లోని 25 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావల్సి ఉంది. అయితే శివారు ప్రాంతాలకు పూర్తిగా సాగునీరు అందడం లేదు. ప్రధానంగా కాలువల ఆధునికీకరణపై యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రాజెక్టు జేఈ పి.శ్రావణిని వివరణ కోరగా.. ‘కాలువల్లోని గుర్రపు డెక్కను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపించాం. ‘ఉపాధి’లో కాలువలు అభివృద్ధి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే సాగునీటికి ఆటంకం లేకుండా గుర్రపు డెక్కను తొలగించే పనులను చేపడతాం.’ అని తెలిపారు.
Updated Date - Jun 01 , 2025 | 11:36 PM