ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లి పాలు శ్రేయస్కరం

ABN, Publish Date - Aug 03 , 2025 | 12:16 AM

: పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ సీడీపీవో రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం మండలంలోని పెదభోగిలి పంచాయతీ పరిధిలోని అప్పయ్యపేట, సీతానగరం, బుడ్డిపేట అంగన్‌వాడీ కేంద్రాల గర్భిణులకు అవగాహన సదస్సు అప్పయ్యపేటలో సర్పంచ్‌ జె.తేరేజమ్మ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పూర్ణిమ పాల్గొన్నారు.

సాలూరు రూరల్‌: తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహిస్తున్న కార్యకర్తలు:

సీతానగరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ సీడీపీవో రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం మండలంలోని పెదభోగిలి పంచాయతీ పరిధిలోని అప్పయ్యపేట, సీతానగరం, బుడ్డిపేట అంగన్‌వాడీ కేంద్రాల గర్భిణులకు అవగాహన సదస్సు అప్పయ్యపేటలో సర్పంచ్‌ జె.తేరేజమ్మ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పూర్ణిమ పాల్గొన్నారు.

ఫకురుపాం,ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): పుట్టిన పసిపిల్లలకు తల్లిపాలతోనే ఆరోగ్యం అని కురుపాం ఐసీడీఎస్‌ పీవో జి.రజినీ దుర్గ తెలిపారు. కురుపాంలో అంగన్‌వాడీ కార్యకర్త జె.సరోజ ఆధ్వర్యంలో తల్లిపాలువరోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ పీఓ జి.రజిని దుర్గ తల్లిపాలు ఆవశ్యకతపై వివరించారు.కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రామలక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ ప్రత్యూష,ఏఎన్‌ఎంలు పద్మ,పల్లవి పాల్గొన్నారు.

ఫ సాలూరు రూరల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి ): ముంగివానివలసలో విశాఖకు చెందిన లీఫార్మ సహకారంతో మహిళా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో 250 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కిట్లు ఫౌండర్‌ లీలారాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లిపాల వారోత్సవాలపై ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఐసీడీఎస్‌ సీడీపీవో విజయలక్ష్మి, శాంతి,అనురాధ,పుష్ప,విమల, లీలావతి పాల్గొన్నారు.

ఫపాలకొండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగరపంచాయతీలోని ఏలాం జంక్షన్‌లోగల అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు.ఈ సం దర్భంగా గ్రేడ్‌-1 సూపర్‌వైజర్‌ లింగాల శాంతకుమారి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రభు త్వం అందజేస్తున్న పోషకాహారం, గర్భిణులు ఏయే ఆహారం తీసుకోవాలో వివరించారు.

Updated Date - Aug 03 , 2025 | 12:16 AM