ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shooting షూటింగ్‌లో ఆటవిడుపు

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:52 PM

Break in Shooting ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా తోలోమాలి, దేవ్‌మాలి ప్రాంతాల్లో కొద్దిరోజులుగా మహేష్‌బాబు, రాజమౌళి చిత్రం (ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిట్‌ ) షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే కాగా సోమవారం రాత్రి దర్శకుడు రాజమౌళి తోలోమాలి సమీపంలో ఉన్న తంకుబేడ గిరిజన యువకులతో కాసేపు వాలీబాల్‌ ఆడారు.

తంకుబేడలో వాలీబాల్‌ ఆడుతున్న దర్శకుడు రాజమౌళి

సాలూరు రూరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా తోలోమాలి, దేవ్‌మాలి ప్రాంతాల్లో కొద్దిరోజులుగా మహేష్‌బాబు, రాజమౌళి చిత్రం (ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిట్‌ ) షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే కాగా సోమవారం రాత్రి దర్శకుడు రాజమౌళి తోలోమాలి సమీపంలో ఉన్న తంకుబేడ గిరిజన యువకులతో కాసేపు వాలీబాల్‌ ఆడారు. వారితో ఉల్లాసంగా గడిపారు. స్టార్‌ దర్శకుడు తమతో వాలీబాల్‌ ఆడడంతో ఆ ప్రాంతవాసులు ఆనం దంలో మునిగిపోయారు. ఇదిలా ఉండా కోరాపుట్‌ జిల్లా జైపూర్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌, యూట్యూబర్‌ గురించి తెలుసుకున్న దర్శకుడు రాజమౌళి ఆయనకు కబురు పంపి సెట్‌లోకి అనుమతించారు. అనంతరం ఆ జర్నలిస్ట్‌ను ఇంటర్వ్యూ చేశారు. యూట్యూబ్‌లో నటన, ఒడియా చిత్రాల్లో వేసిన పాత్రలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. తనకు అవకాశ మివ్వాలని ఆ జర్నలిస్ట్‌ కోరగా మళ్లీ కబురు పంపుతానన్నారు. ఇదిలా ఉండగా తోలోమాలి, దేవ్‌మాలి ప్రాంతాల్లో ఈ షూటింగ్‌ జరుగుతుండడంతో ఆయా ప్రాంతాలకు రాత్రి,పగలు అనే తేడాలేకుండా పర్యటకులు తరలివస్తున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:52 PM