ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాల్యానికి బంధనాలు

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:08 AM

Bonds to childhood వివాహ జీవితంలో అడుగు పెట్టేవారు ముందు మానసికంగా సిద్ధం కావాలి. పెళ్లి అంటే నూరేళ్ల బంధమని తెలుసుకోవాలి. పుట్టింట్లో నుంచి మెట్టింట్లో అడుగు పెట్టేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను వారు సానుకూలంగా తీసుకుని అనుకూలంగా మార్చుకోగలగాలి. అందుకు వయసు కూడా కీలకం. అయితే దగ్గర బంధువు అని.. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం అని.. మేనళ్లుడు అని.. మంచి సంబంధాలు రావేమోనని ముందే బాలికలను పెళ్లి పీటలు ఎక్కించేస్తున్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలను ఆలోచించకుండా బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో బాల్య వివాహాలు గుట్టుగా జరిగిపోతున్నాయి.

బాల్యానికి బంధనాలు

జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు

అవగాహన లేక జరిపిస్తున్న తల్లిదండ్రులు

తల్లీ పిల్లలకు తప్పని అనారోగ్య సమస్యలు

కొన్నింటిని అడ్డుకుంటున్న చైల్డ్‌లైన్‌

- రాజాం నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన బాలికకు కుటుంబ సభ్యులు ఇటీవల వివాహం జరిపించేందుకు సిద్ధపడ్డారు. మేనళ్లుడు అమెరికాలో ఉన్నాడని, మంచి సంబంధం మళ్లీ రాదని నిర్ణయించుకుని కూతురును కట్టబెట్టాలనుకున్నారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించడంతో వారు పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

- చీపురుపల్లి నియోజకవర్గంలో ఓ బాలికను సమీప బంధువుతో వివాహం జరిపించేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ వరుడి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని, సొంత మనిషి అని పెళ్లికి ఆసక్తి చూపారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

రాజాం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): వివాహ జీవితంలో అడుగు పెట్టేవారు ముందు మానసికంగా సిద్ధం కావాలి. పెళ్లి అంటే నూరేళ్ల బంధమని తెలుసుకోవాలి. పుట్టింట్లో నుంచి మెట్టింట్లో అడుగు పెట్టేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను వారు సానుకూలంగా తీసుకుని అనుకూలంగా మార్చుకోగలగాలి. అందుకు వయసు కూడా కీలకం. అయితే దగ్గర బంధువు అని.. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం అని.. మేనళ్లుడు అని.. మంచి సంబంధాలు రావేమోనని ముందే బాలికలను పెళ్లి పీటలు ఎక్కించేస్తున్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలను ఆలోచించకుండా బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో బాల్య వివాహాలు గుట్టుగా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత కొద్ది నెలలకే వారు అనారోగ్యానికి గురవుతున్నారు. రక్తహీనత, ఇతర రుగ్మతలతో బాధ పడుతున్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిసినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పది, ఇంటర్‌ విద్యార్థినులను పెళ్లిపీటలు ఎక్కిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, ఘటనలు చూస్తున్న కొందరు తల్లిదండ్రులు మానసికంగా బలహీనమై ఆడపిల్లలకు వివాహం జరిపిస్తే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. పిల్లలను బలంగా తయారు చేయకుండా తాము లేనిపోని అపోహలతో వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు.

కొన్ని బాల్య వివాహాలను మాత్రమే అధికారులు అడ్డుకోగలుగుతున్నారు. 2024లో 95 వివాహాలను అడ్డుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో 88, 2022లో 50, 2021లో 24, 2020లో 32 బాల్య వివాహాలను కట్టడి చేశారు. అయితే అంతకుమించి వివాహాలు జిల్లా వ్యాప్తంగా జరిగినట్టు తెలుస్తోంది. ప్రతి నెలా విజయనగరం ఘోషాస్పత్రికి వచ్చే గర్భిణుల్లో 30 మంది వరకూ బాలికలు ఉంటున్నట్లు సమాచారం. ఏటా విద్యాసంవత్సరం ముగిసిన తరువాత వివాహాలు జరిపిస్తుంటారు. ఆ సమయంలో చడీ చప్పుడు లేకుండా ముహూర్తాలు ఖరారు చేస్తున్నారు. రహస్యంగా కూడా వివాహాలు జరిపిస్తున్న వారు ఉన్నారు. అయితే ఇటీవల కొంతమంది బాలికల్లో చైతన్యం వచ్చింది. చిన్ననాటే వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడని వారు నేరుగా 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. ఈ విషయంలో చైల్డ్‌లైన్‌తో పాటు అన్ని శాఖలు అవగాహన పెంచితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

నియంత్రిస్తున్నాం

జిల్లాలో బాల్య వివాహాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. వాటి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు, ఐసీడీఎస్‌, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకపోతే వారి పిల్లల భవిష్యత్‌కే ముప్పు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి. ఇదో సామాజిక బాధ్యతగా చూడాలి.

- శాంతికుమారి, ఐసీడీఎస్‌ పీడీ, విజయనగరం

అనర్థాలే అధికం

బాల్య వివాహాలతో అనర్థాలే అధికం. సంతానోత్పత్తి సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పుట్టిన పిల్లలతో పాటు తల్లికి తీవ్ర అనారోగ్యం తప్పదు. చిన్న వయసులోనే పెళ్లిళ్లతో ఇతర రుగ్మతలు కూడా ఎదురుకావొచ్చు. గైనిక్‌ సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్న వారిలో బాల్య వివాహ బాధితులే అధికం. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేజేతులా వారి పిల్లలను ప్రమాదంలో పడేయొద్దు.

- జి.సునీత, వైద్యురాలు, రాజాం

---------------

Updated Date - Apr 26 , 2025 | 12:08 AM