ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Boddavalasa VRO in ACB trap ఏసీబీ వలలో బొడ్డవలస వీఆర్వో

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:43 PM

Boddavalasa VRO in ACB trap రైతు నుంచి లంచం తీసుకుంటూ బొడ్డవలస వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. మ్యూటేషన్‌ కోసం రూ.15వేలు డిమాండ్‌ చేసిన ఆయన రైతు నుంచి రూ.13వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన జిల్లా రెవెన్యూ విభాగంలో కలకలం సృష్టించింది.

ఏసీబీవలలో చిక్కిన బొడ్డవలస వీఆర్వో శ్రీనివాసరావు

ఏసీబీ వలలో బొడ్డవలస వీఆర్వో

ల్యాండ్‌ మ్యూటేషన్‌ కోసం రూ.15వేలు డిమాండ్‌

రైతు నుంచి రూ.13వేలు తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

డెంకాడ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రైతు నుంచి లంచం తీసుకుంటూ బొడ్డవలస వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. మ్యూటేషన్‌ కోసం రూ.15వేలు డిమాండ్‌ చేసిన ఆయన రైతు నుంచి రూ.13వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన జిల్లా రెవెన్యూ విభాగంలో కలకలం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ వీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

డెంకాడ మండలం ఆకులపేట గ్రామానికి చెందిన రైతు పతివాడ అప్పలపైడి గతేడాది డిసెంబరులో చనిపోయారు. ఆయన పేరుమీద ఆకులపేటలో 28 సెంట్ల భూమి ఉంది. ఆయన కుమారుడు పతివాడ త్రినాథరావు భూమిని తన తల్లి పేరుమీద మ్యూటేషన్‌ చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీన తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. భూముల పరిధి బొడ్డవలస పంచాయతీ కావడంతో వీఆర్వో ఎ.శ్రీనివాసరావును సంప్రదించాడు. మ్యుటేషన్‌ కావాలంటే రూ.15వేలు లంచం ఇవ్వాల్సి ఉంటుందని వీఆర్వో చెప్పాడు. తమది పేద కుటుంబమని, లంచం ఇచ్చుకోలేనని రైతు బతిమాలినా వీఆర్వో తగ్గలేదు. కనీసం రూ.13వేలు అయినా ఇవ్వాలన్నాడు. దీంతో త్రినాథరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం ఉదయం వీఆర్వో శ్రీనివాసరావు ఇంటికి రైతు బయలుదేరాడు. విజయనగరంలో వాకింగ్‌లో ఉన్న వీఆర్వోకు డబ్బులిచ్చాడు. రైతు నుంచి లంచం రూ.13వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యేండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐ ఎం.మహేశ్వరరావు, సీఐ వాసు నారాయణ, విజయనగరం ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:43 PM