చిక్కిన బైకుల దొంగ
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:24 AM
కొత్తవలస మండలం మంగళంపాలెం గ్రా మానికి చెందిన బైకుల దొంగ రాకేటి సూర్యప్ర కాశ్ పోలీసులకు చిక్కాడు.
భోగాపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): కొత్తవలస మండలం మంగళంపాలెం గ్రా మానికి చెందిన బైకుల దొంగ రాకేటి సూర్యప్ర కాశ్ పోలీసులకు చిక్కాడు. శనివారం భోగాపురం మండలం లోని రాజాపులోవ సమీపంలో సూర్యప్రకా శ్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. దీనిపై విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ పాపారావుకు వచ్చిన సమాచారం మేరకు సీఐ దుర్గాప్రసాద్‌రావు సూచనలతో సిబ్బంది విశాఖ నుంచి రాజాపులోవ వచ్చే రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. మంగళంపాలెంకు చెందిన రాకేటి సూర్యప్రకాశ్ బైకుపై వస్తుండగా పట్టుకున్నా రు. బైకుకు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో అదుపులోకి తీసుకు న్నారు. అయితే ఆ బైకుతో పాటు మరో నాలుగు బైకులు దొంగిలించినట్లు అంగీ కరించాడు. గతంలో భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో 1, విశాఖ జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్‌లో 2, పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో 1, బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒకటి.. బైకు చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యప్రకాశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈసందర్భంగా సీఐ దుర్గాప్రసాద్ రావును, ఎస్‌ఐ పాపారావును, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Updated Date - Jul 27 , 2025 | 12:24 AM