మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:03 AM
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వ్యాధి నిరోధకశాఖ అధికారి అచ్చుతకుమారి కోరారు. మంగళవారం వేపాడ పీహెచ్‌సీలో వైద్య సిబ్బందితో సమీక్షించారు.వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలని, ప్రజలు వ్యాఽధుల బారిన పడ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యాప్స్‌ను అప్ లోడ్ చేయాలని సూచించారు.
వేపాడ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వ్యాధి నిరోధకశాఖ అధికారి అచ్చుతకుమారి కోరారు. మంగళవారం వేపాడ పీహెచ్‌సీలో వైద్య సిబ్బందితో సమీక్షించారు.వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలని, ప్రజలు వ్యాఽధుల బారిన పడ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యాప్స్‌ను అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రతి బుధ,శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వ హించాలని, స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సందర్శించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్ర మంలో వైద్యులు వేణు, సంజన సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:03 AM