ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Before the Kharif season..! ఖరీఫ్‌ సీజన్‌కు ముందే..!

ABN, Publish Date - May 11 , 2025 | 10:58 PM

Before the Kharif season..! సూపర్‌సిక్స్‌ హామీలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు చేపడుతోంది. సర్కారు ఆదేశాలతో ఇప్పటికే జిల్లా అధికారులు అర్హులై జాబితాను సిద్ధం చేస్తున్నారు.

అర్హుల జాబితా తయారీలో అధికారులు నిమగ్నం

గత ప్రభుత్వం కంటే రెట్టింపు సాయం

ఆర్‌వోఎఫ్‌ఆర్‌, కౌలు రైతులకూ వర్తింపు

పార్వతీపురం, మే11(ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్‌ హామీలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు చేపడుతోంది. సర్కారు ఆదేశాలతో ఇప్పటికే జిల్లా అధికారులు అర్హులై జాబితాను సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఏడాది పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందనుంది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 1.44 లక్షల మంది పీఎం కిసాన్‌, రైతు భరోసా పథకాల ద్వారా లబ్ధిపొందారు. వారిలో 30 వేల మంది ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులకు రూ.13,500 మాత్రమే ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు అందిస్తే దానికి మరో రూ.7,500 అదనంగా చేర్చి ఖాతాల్లో జమచేసేది. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రం అందించే రూ.6 వేలకు మరో రూ.14 వేలు జోడించి రూ.20 వేలు అందించనుంది. సాగు ఖర్చులు నిమిత్తం రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని మూడు విడతల్లో రూ.20 వేలు అందించనున్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయనుంది.

వీఏఏ లాగిన్లకు వెబ్‌ల్యాండ్‌ వివరాలు...

అన్నదాత సుఖీభవకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. అర్హులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయాధికారి లాగిన్లకు ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్లు, రైతు పేరు, సాగు విస్తీర్ణం పరిశీలించి వ్యవసాయాధికారి లాగిన్‌కు పంపుతారు. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయాధికారికి చేరుతాయి. వెబ్‌ల్యాండ్‌లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. వీలుకాని పక్షంలో తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లి సరిచేసిన అనంతరం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అనర్హులను క్షేత్రస్థాయి పరిశీలనలోనే గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 26 లోపు రైతులు నమోదు చేసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. అదేవిధంగా మృతులు, ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్‌ పొందేవారు, ఆదాయపు పన్ను చెల్లించే వారి వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేసి వారి పేర్లు తొలగించాలని వ్యవసాయ, రెవెన్యూశాఖలకు ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్‌ఎస్‌కేలకు తుది జాబితాలు...

జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్‌ల్యాండ్‌ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పంపిస్తారు. నిబంఽధనల ప్రకారం ఆధార్‌ అనుసంధానంగా అర్హులను గుర్తించి రైతు సేవా కేంద్రాలకు తుది జాబితాలను పంపిస్తారు. ఈ జాబితాలో పేరున్న రైతులకు తప్పనిసరిగా ఈకేవైసీ చేయిస్తారు. ఈ క్రమంలో అనర్హులుంటే అధికారులు గుర్తిస్తారు. అర్హులైన రైతన్నలకు తప్పనిసరిగా ఆర్థికసాయం అందించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అప్పులు చేయక్కర్లే..

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నగదు అందిస్తే వ్యవసాయ పెట్టుబడులకు ఇతరుల వద్ద అప్పు చేసే పరిస్థితి ఉండదు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఖాతాల్లో జమ చేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది.

- సూర్యనారాయణ, రైతు, పార్వతీపురం

=================================

జాబితాను తయారు చేస్తున్నాం

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిబంధనల ప్రకారం అర్హుల జాబితాను తయారు చేస్తున్నాం. రైతులకు ఈకేవైసీ చేపట్టిన అనంతరం తుది జాబితా తయారవుతుంది.

- రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయాధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - May 11 , 2025 | 10:58 PM