వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:42 PM
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముండడంతో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి జీవనరాణి కోరారు. శనివారం డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డెంకాడ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముండడంతో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి జీవనరాణి కోరారు. శనివారం డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈహెచ్‌ఏఆర్, అభా ఐడీ, పీహెచ్‌సీలో అందుతున్న నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి డాక్టర్ అనూషను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వ్యాపించే వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌వో రాజు, యుడీసీ దుర్గారావు, ఫార్మసిస్టు అప్పలనాయుడు, పీహెచ్‌ఎన్ వరలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:42 PM