ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పథకాల అమలుకు బ్యాంకుల సహకారం అవసరం

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:59 PM

ప్రభుత్వం నిర్దేశించుకున్న సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్దేశించుకున్న సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరి షత్‌ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, వివిధ శాఖ ల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడారు. అర్హులకు ప్రభుత్వం అందించే పథకా ల అమలులో అన్ని బ్యాంకుల సహకారం ఉండాలన్నా రు. పట్టు పరిశ్రమకు గతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి సాయం ఉండేదని, ప్రస్తుతం అది అమలు కావడవం లేదని సంబంధిత అధికారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చా రు. దీనికి స్పందించిన ఆయన.. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. ఈ సమీక్షలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరు వీవీ రమణమూర్తి, ఎంపీడీవో ఇప్పలవలస సురేష్‌, బ్యాంకు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. కర్లాంలో రూ.21లక్ష ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన ఐదు సీసీ రోడ్లను ఆయన శుక్రవారం రాత్రి ప్రారంభించారు. పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:59 PM