ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

bad position to vechicle పట్టుబడితే.. తుక్కే!

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:57 PM

bad position to vechicle తుప్పుపట్టిన కారు.. విడిభాగాలు మాయమైన బైకు.. తుక్కుగా మారుతున్న వ్యాను! ఇవీ చాలా పోలీసుస్టేషన్లలో కనిపించే దృశ్యాలు. ఎండకు ఎండి.. వానకు తడిచి పనికి రాకుండా పోతున్నాయి. ప్రమాదాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల తరలింపు, దొంగిలించినవి.. ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు స్టేషన్ల ఆవరణాల్లో పేరుకుపోతున్నాయి.

రాజాం పోలీస్‌స్టేషన్‌లో తుక్కువతున్న వాహనాలు

పట్టుబడితే.. తుక్కే!

పోలీసుస్టేషన్లలో మగ్గిపోతున్న వాహనాలు

సంరక్షించే చర్యల్లేవ్‌.. జిల్లా అంతటా ఇదేతీరు

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): తుప్పుపట్టిన కారు.. విడిభాగాలు మాయమైన బైకు.. తుక్కుగా మారుతున్న వ్యాను! ఇవీ చాలా పోలీసుస్టేషన్లలో కనిపించే దృశ్యాలు. ఎండకు ఎండి.. వానకు తడిచి పనికి రాకుండా పోతున్నాయి. ప్రమాదాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల తరలింపు, దొంగిలించినవి.. ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు స్టేషన్ల ఆవరణాల్లో పేరుకుపోతున్నాయి. కేసులు పరిష్కారం కాక కొన్ని ఇతరత్రా కారణాలతో మరికొన్ని తుక్కువుతున్నాయి. పొరపాటునో, గ్రహపాటునో పోలీసులకు వాహనం చిక్కితే వాటిపై ఆశలు వదులుకోవాల్సిందే...కారణం ఏదైనా వాహనాలు స్టేషన్ల ప్రాంగణాల్లోకి వెళ్లాక ఇక అంతేమరి.. ఎండకు ఎండి వానకు తడిచి తుక్కుపట్టాల్సిందే.. జిల్లా అంతటా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రధానంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్టేషన్లలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది.

హైవేలో ఎక్కువ..

రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. విజయనగరం కేంద్రంగా అటు విశాఖ, ఇటు శ్రీకాకుళం, మరోవైపు బొబ్బిలి, రాజాం తదితర మార్గాలలో చాలా వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. చిన్నపాటి ప్రమాదాలైతే రాజీమార్గం ద్వారా పోలీస్‌స్టేషన్‌ వరకూ వెళ్లకుండానే సర్దుబాటు చేసుకుంటున్నారు. భారీ ప్రమాదాలు, మరణాలు, మత్తు పదార్థాలను తరలిస్తూ పట్టుబడుతున్న సందర్భాలలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్లకు చేరుతున్న వాహనాలు మూలకు చేరుతున్నాయి.

కేసులు తేలక కొన్ని..

ప్రమాదాలకు గురైన వాహనాలు ఏళ్ల తరబడి కేసులు పూర్తికాక పోలీస్‌స్టేషన్ల ఆవరణలో ఉండిపోతున్నాయి. వాహన యజమానులకు జరిమానా విధించిన సందర్భాలలో అపరాధ రుసుం చెల్లించి వాహనాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అప్పటికే వాహనం తుక్కుతుక్కు కావడం ఒకెత్తు కాగా ప్రమాదాలకు గురైన వాహనాలను తిరిగి తీసుకువెళ్లేందుకు చాలామంది యజమానులు ఆసక్తి చూపడం లేదు. గంజాయి, మద్యం రవాణా సందర్భాలతో పాటు కొన్ని ప్రత్యేక సందర్భాలలో పోలీసులు పట్టుకుంటున్న వాహనాలదీ ఇదే పరిస్థితి. అనుమానాస్పదమైనా, సరైన ధ్రువపత్రాలు లేకపోయినా వాహనాలను విడిచిపెట్టి పలాయనం చిత్తగించిన సందర్భాలలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నవి కూడా స్టేషన్ల ప్రాంగణాలలో పేరుకుపోతున్నాయి.

జిల్లాలో చాలాచోట్ల..

జిల్లా కేంద్రంతో పాటు అన్ని పోలీస్‌స్టేషన్లలో ఇలాంటి వాహనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రధానంగా రాజాం, బొబ్బిలి, బొండపల్లి, గజపతినగరం, రామభద్రపురం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, ఎస్‌.కోట, వేపాడ, కొత్తవలస, ఎల్‌.కోట పోలీస్‌ స్టేషన్లలో ఎక్కువగా కనిపిస్తున్నారు ఆయా స్టేషన్ల హౌస్‌ అధికారులు సైతం వీటిని సంరక్షించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇదిలా ఉంటే పోలీస్‌స్టేషన్లకు చేరుకున్న వాహనాలలోని బ్యాటరీలు, హారన్లు, ఇంజన్‌లోని విలువైన పరికరాలతో పాటు ఇతరత్రా మెటీరియల్‌ మాయం అవుతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు.

వేలం వేయాల్సి ఉన్నా..

్లనిబంధనల ప్రకారం ఒక వాహనం ప్రమాదవశాత్తుగానీ, స్వాధీనం చేసుకున్నా, చోరీకి గురై పోలీసులకు చిక్కితే స్టేషన్‌కు తరలిస్తారు. వీటిని సీజ్‌చేసి రెవెన్యూ కార్యాలయాలకు సమాచారమిస్తారు. బహిరంగ ప్రకటన విడుదల చేసి ఆరు నెలల అనంతరం వేలం వేస్తారు. ఎక్సైజు కేసుల్లో నాటుసారా, అక్రమ మద్యం రవాణాకు సంబంధించి ఎప్పటికప్పుడు వాహనాలను వేలం వేస్తున్నారు. కానీ పోలీస్‌శాఖకు సంబంధించి వేలం వేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన వాహనాన్ని తిరిగి వాడేందుకు చాలామంది యజమానులు ఇష్టపడటం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో వాహనాలు పేరుకుపోతున్నాయి.

.

Updated Date - Apr 29 , 2025 | 11:57 PM