ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modern Farming ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన అవసరం

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:07 PM

Awareness on Modern Farming Methods is Essential జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరమని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. శనివారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం నిర్వహించారు.

వివిధ పంటలపై అవగాహన పత్రాలను విడుదల చేస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరమని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. శనివారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అధునాతన పద్ధ తుల్లో వ్యవసాయం చేయడం వల్ల రైతులు అధిక దిగుబడులు, రాబడిని పొందొచ్చు. జిల్లాలో 51 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. 70 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యవసాయ అనుబంధ రంగాలు ఒక యూనిట్‌గా పనిచేసి 16 శాతం వృద్ధిని సాధించాలి. గత ఏడాది రాగి, కంది, మొక్కజొన్న పంటలను ప్రోత్సహించాం. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 48 గంటల్లోగా చెల్లింపులు చేశాం. ఫాంపాండ్స్‌ ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలి. బిందు సేద్యం యూనిటట్లపై గిరిజన రైతులకు శతశాతం, ఇతరులకు 90 శాతం వరకు సబ్సిడీ ఉంది. ఏనుగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మరో రెండు నెలల్లో చెక్‌డ్యామ్‌లు, కెనాల్స్‌ మరమ్మతు పనులు పూర్తి చేయిస్తాం.’ అని తెలిపారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో యూనివర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ సత్యనారాయణ, అప్పలస్వామి, జి.శివనారాయణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి బి.శ్యామల, ఏపీసీఎన్‌ఎఫ్‌ అధికారి షన్ముఖ, ప్రాజెక్టు వ్యవసాయాధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

శాస్ర్తీయంగా ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, గృహాల్లో పాడైన ఎల క్ర్టానిక్‌ పరికరాలు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను శాస్ర్తీయంగా రీసైక్లింగ్‌ చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో ఉన్న ఇ-వ్యర్థాలను మున్సిపల్‌ కార్యాలయ చెత్తసేకరణ వాహనంలోకి డంప్‌ చేయించారు. ఇటువంటి వ్యర్థాలను గ్రీన్‌ అంబాసిడర్లకు అందజేయాలని సూచించారు. జేసీ శోభిక, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:07 PM