చౌకబారు ప్రకటనలు మానుకోండి
ABN, Publish Date - May 09 , 2025 | 12:04 AM
రైతాంగంపై వైసీపీ కపట ప్రేమ చూపిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆరోపించా రు. ఇకనైనా వైసీపీ నేతలు చౌకబారు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ఐదేళ్లుగా వ్యవసాయాన్ని, రైతులను విస్మరించిన వైసీపీ నేతలకు హఠాత్తుగా రైతులు, వ్యవసాయం గుర్తుకు వచ్చిందన్నారు. గురువారం విజయనగరంలోని టీడీపీ కార్యాల యంలో నాగార్జున విలేకరులతో మా ట్లాడుతూ వైసీపీ మాటలకు రైతులు మరోసారి మోసపోరన్నారు.
విజయనగరం రూరల్, మే 8 ( ఆంధ్రజ్యోతి): రైతాంగంపై వైసీపీ కపట ప్రేమ చూపిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆరోపించా రు. ఇకనైనా వైసీపీ నేతలు చౌకబారు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ఐదేళ్లుగా వ్యవసాయాన్ని, రైతులను విస్మరించిన వైసీపీ నేతలకు హఠాత్తుగా రైతులు, వ్యవసాయం గుర్తుకు వచ్చిందన్నారు. గురువారం విజయనగరంలోని టీడీపీ కార్యాల యంలో నాగార్జున విలేకరులతో మా ట్లాడుతూ వైసీపీ మాటలకు రైతులు మరోసారి మోసపోరన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారని, నాలుగైదు సంవ త్సరాల్లో రబీ సీజన్‌లో ఎప్పుడైనా ప్రొక్యూర్‌మెంట్ జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ రైతుల అకౌంట్లలో 14 రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పేవారని, కాని సంక్రాంతి దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదన్న విషయాన్ని వైసీపీ నేతలు మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు, ఆల్తి బంగారుబాబు, కనకల మురళీమోహన్ , గంటా పోలినాయుడు, మైలిపిల్లి సింహాచలం, గొర్లె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - May 09 , 2025 | 12:04 AM