కన్వీనర్ల ఎంపికకు సహకరించండి
ABN, Publish Date - May 11 , 2025 | 11:57 PM
పార్టీ మండల కన్వీనర్ల ఎంపిక విషయంలో అందరూ ఏకాభిప్రాయం ఇవ్వాలని టీడీపీ కురుపాం నియోజకవర్గ పరిశీలకుడు మహేష్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరేశ్ చంద్రదేవ్ కోరారు.
జియ్యమ్మవలస, మే 11 (ఆంధ్రజ్యోతి): పార్టీ బలోపే తంలో మండల కన్వీనర్లదే కీలక పాత్ర అని, వారి ఎంపిక విషయంలో అందరూ ఏకాభిప్రాయం ఇవ్వాలని టీడీపీ కురుపాం నియోజకవర్గ పరిశీలకుడు ఆరేటి మహేష్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరేశ్ చంద్రదేవ్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం మహేష్ అధ్యక్షత న మండల స్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా మండలం నుంచి కన్వీనర్ కావాలనే ఆశావాహుల్లో పల్ల రాంబాబు, గురాన శ్రీరా మ్మూర్తి, లచ్చిపతుల తాతబాబు, జోగి భుజంగరావు, దాసరి రామారావులు తమ ఆసక్తిని వివరించారు. అయి తే దీనిపై ఇప్పటివరకు కన్వీనర్‌గా కొనసాగుతున్న పల్ల రాంబాబు మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పుడు తనను కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ బలోపే తానికి ఆదేశిస్తున్నారని, అధికారంలోకి రాగానే తనను పక్క పెట్టే పరిస్థితి చాలా బాధపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరేశ్ చంద్రదేవ్ మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయమే ప్రతిఒక్కరూ శిరోధార్యంగా భావించి నడుచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సత్యంనాయుడు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:57 PM