Ashok visits Pydimamba పైడిమాంబను దర్శించుకున్న అశోక్
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:46 PM
Ashok visits Pydimamba కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు బుధవారం సాయంత్రం చదురుగుడిలో పైడిమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రసాదం, పైడిమాంబ చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ ఈవో శీరిష
పైడిమాంబను దర్శించుకున్న అశోక్
విజయనగరం రూరల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు బుధవారం సాయంత్రం చదురుగుడిలో పైడిమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవా గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. అశోక్‌తో పాటు వచ్చిన సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె..విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు ఆలయ మర్యాదలతో ఈవో శీరిష, సిబ్బంది స్వాగతం పలికారు. వేద ఆశ్వీరచనం అందించాక ప్రసాదం, పైడిమాంబ చిత్రపటాన్ని అందజేశారు.
Updated Date - Jul 16 , 2025 | 11:46 PM