ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ashok... A Rare Record అశోక్‌ .. అరుదైన రికార్డు

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:05 AM

Ashok... A Rare Record ఉమ్మడి జిల్లా నుంచి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా విజయనగరం రాజ వంశానికి చెందిన పూసపాటి అశోక్‌గజపతి రాజు రికార్డు సృష్టించారు. ఆయన శనివారం గోవా రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

అశోక్‌ గజపతిరాజుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న మంత్రి సంధ్యారాణి

గోవాలో ప్రమాణ స్వీకారం పూర్తి

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

సాలూరు రూరల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా నుంచి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా విజయనగరం రాజ వంశానికి చెందిన పూసపాటి అశోక్‌గజపతి రాజు రికార్డు సృష్టించారు. ఆయన శనివారం గోవా రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్‌ ఆరాధే ప్రమాణస్వీకారం చేయించారు. ఉమ్మడి విజయనగరం నుంచి గవర్నర్‌ రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే కావడంతో ఉమ్మడి జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బొబ్బిలిరాజు రావు శ్వేతాచలపతి సర్‌ రామకృష్ణ రంగారావు మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో విశాఖ జిల్లాలో బొబ్బిలి ఉండేది. మద్రాస్‌ అసెంబ్లీకి 1930లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్‌ పార్టీ నుంచి రావు శ్వేతాచలపతి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మద్రాస్‌ ప్రెసిడెన్షీ సీఎంగా పి.మునుస్వామి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ పార్టీలో ముసలం ఏర్పడి చీలికకు దారితీయడంతో సీఎం పదవికి మునుస్వామి రాజీనామా చేశారు. దీంతో మద్రస్‌ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా బొబ్బిలి రాజు రావు శ్వేతాచలపతి బాధ్యతలు స్వీకరించారు. 1932, నవంబరు 5 నుంచి 1936 ఏప్రిల్‌ 4 వరకు, మళ్లీ 1936 ఆగస్టు 24, నుంచి 1937, ఏప్రిల్‌ 1 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి విజయనగరంలో ఉన్న బొబ్బిలి నుంచి ఒకరు మద్రాస్‌ సీఎంగా పనిచేయగా, ప్రస్తుతం అశోక్‌ గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర,రాష్ట్రమంత్రులుగా పనిచేసిన పాలనా అనుభవంతోపాటు నిజా యితీకి నిలువుటద్దమైన ఆయన గవర్నర్‌గా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించనున్నారని ఉమ్మడి జిల్లావాసులు విశ్వసిస్తున్నారు.

మహోన్నత వ్యక్తికి ఉన్నత గౌరవం

పార్వతీపురం/సాలూరు: టీడీపీ నుంచి తొలిసారి గోవా గవర్నర్‌గా నియామకమైన పూసపాటి అశోక్‌ గజపతిరాజు మహోన్నతమైన వ్యక్తి అని, ఆయనకు ఉన్నత గౌరవం లభించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ పదవికి అశోక్‌ గజపతిరాజును సిఫారసు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అశోక్‌ గజపతిరాజు పాలనా అనుభవం గోవా అభివృద్ధికి దోహదపడుతందన్నారు. గోవా రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో జరిగిన అశోక్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమెతో పాటు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, లోకేశ్‌, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:05 AM