ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాఫీ.. హ్యాపీ!

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:28 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రావాల్సిన నీటి తీరువా బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ఇటీవల జీవో జారీ చేసింది.

జియ్యమ్మవలస మండల పరిధిలో వట్టిగెడ్డ ప్రాజెక్టు కుడి కాలువ ఇలా..

- నీటి తీరువా బకాయిలపై వడ్డీ మాఫీ

- జీవో జారీ చేసిన ప్రభుత్వం

- హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

- 2019 నుంచి కనిపించని వసూళ్లు

- దృష్టి సారించని అధికారులు

- ప్రాజెక్టులు, కాలువల నిర్వహణపై ప్రభావం

జియ్యమ్మవలస, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రావాల్సిన నీటి తీరువా బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. జిల్లాలో జాయింట్‌ ఎల్‌పీఎంలు కలుపుకుని మొత్తం నీటి తీరువా బకాయి రూ.11.57 కోట్లుగా ఉంది. పార్వతీపురం డివిజన్‌లో నీటి తీరువా బకాయి రూ.3.59 కోట్లు ఉండగా.. ప్రభుత్వం నిర్ణయించిన ఆరు శాతం ప్రకారం రూ. 17.15 లక్షల మేర వడ్డీ మాఫీ చేయాల్సి ఉంది. అదేవిధంగా పాలకొండ డివిజన్‌లో రూ.8.02 కోట్లు బకాయిల్లో వడ్డీ రూ. 40.34 లక్షలు మాఫీ చేయాలి.

నిధుల వినియోగం ఇలా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఎకరాకు రూ. 200 చొప్పున రెవెన్యూశాఖ రైతుల వద్ద నుంచి వసూలు చేయాలి. ఇందులో 95 శాతం (అంటే రూ. 190లు) ప్రాజెక్టుకు, మిగిలిన 5 శాతం (అంటే రూ. 10లు) సంబంధిత పంచాయతీకి జమ చేయాల్సి ఉంది. ప్రాజెక్టులకు జమ చేసిన 95 శాతం నిధుల్లో 60 శాతం నిధులు నీటి సంఘాలకు, 35 శాతం నిధులు ప్రాజెక్టు కమిటీకి ఇవ్వాల్సి ఉంది. నీటి సంఘాలకు ఇచ్చిన 60 శాతం నిధులతో ప్రాజెక్టు పరిధిలో నీటి పారుదలశాఖ ఆపరేషన్స్‌ అండ్‌ మెంటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనులు చేయాలి. అంటే కాలువల లైనింగ్‌ శుభ్రం చేయడం, పూడిక, మట్టి తీత పనులు చేపట్టి ప్రతి ఎకరాకు సాగు నీరందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నీటి పారుదల శాఖపై ఉంది. నీటి సంఘాలకు అందే నిధుల్లో 10 శాతం పరిపాలనా విస్తరణకు ఉపయోగించాలి. అంటే అవసరమైన లస్కర్లను నియమించుకునే వీలుంది.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం డివిజన్‌లో సాలూరు, మక్కువ, పాచిపెంట, సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో 140 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 71,328 ఖాతాలు ఉన్నాయి. అయితే సీతానగరం నుంచి రూ. 33,516 వరకు వసూలు అవగా.. మిగతా మండలాల నుంచి రూపాయి కూడా వసూలు కాలేదు. ఇంకా ఈ డివిజన్‌ నుంచి రూ.3.59 కోట్లు రావాల్సి ఉంది.

- పాలకొండ డివిజన్‌లో సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 139 రెవెన్యూ గ్రామాలు, 68,822 ఖాతాలు ఉన్నాయి. జియ్యమ్మవలస మండలంలో రూ. 5,158, భామినిలో రూ.10,983, పాలకొండలో రూ. 5,438, వీరఘట్టంలో రూ.8,510 చెల్లించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇదికాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో రైతులు చెల్లించినది రూ.16,113. ఇంకా రూ.8.02 కోట్లు చెల్లించాల్సి ఉంది.

- పార్వతీపురం డివిజన్‌లో 8 మండలాల మొత్తం నీటి తీరువా బకాయి రూ. 3.59 కోట్లు ఉండగా.. జియ్యమ్మవలస మండలం నీటి తీరువా మొత్తం బకాయి రూ. 3.26 కోట్లుగా ఉంది. ఆ తరువాత స్థానంలో పాలకొండ మండలం రూ. 2.47 కోట్లు, వీరఘట్టం రూ. 1.90 కోట్ల బకాయిలుతో ఉన్నాయి. ఈ బకాయి వసూళ్లు విషయంలో ఈ మూడు మండలాల రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- నీటి తీరువా విషయంలో జాయింట్‌ ఎల్‌పీఎంల ద్వారా వసూలు చేయాల్సిన నిధులు అదనం. జాయింట్‌ ఎల్‌పీఎంలు ఉన్న రెవెన్యూ గ్రామాలు పార్వతీపురం డివిజన్‌లో 62, పాలకొండ డివిజన్‌లో 40 గ్రామాలు ఉన్నాయి. వీటికి సంబంధించి 23,115 ఖాతాలు ఉన్నాయి. మొత్తం నీటి తీరువా బకాయి రూ. 12.17 కోట్లుగా ఉంది.

అధికారుల నిర్లక్ష్యం..

నీటి తీరువా అనేది ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ముఖ్యమైన నిధి. ప్రాజెక్టుల్లో చిన్న చిన్న పనులు చేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి ఈ నిధులు ఎంతగానో దోహదప డతాయి. అయితే ఏటా రైతుల వద్ద నుంచి నీటి తీరువా వసూలు చేయాల్సిన రెవెన్యూశాఖ అధికా రులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. 2019 నుంచి దానిపై దృష్టి సారించడం లేదు. దీంతో ప్రాజెక్టులు అధ్వానంగా మారుతున్నాయి. పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కతో కాలువలన్నీ నిండిపోవడంతో శివారు భూములకు నీరందడం లేదు.

జమ కావడం లేదు

నీటి తీరువా బకాయిలు వసూళ్లయితే ప్రాజెక్టుల పరిధిలో కాలువల పనులు చేసే అవకాశం ఉంది. వాటి పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవచ్చు. కానీ కొన్నేళ్ల నుంచి రెవెన్యూశాఖ నుంచి నీటి పారుదలశాఖకు నిధులు జమ కావడం లేదు.

ప్రదీప్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, నీటి పారుదలశాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 04 , 2025 | 12:28 AM