ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mega PTM మెగా పీటీఎంకు ఏర్పాట్లు

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:01 AM

Arrangements in Place for Mega PTM జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న ఆహ్లాదకర వాతావరణంలో మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) నిర్వహించాలని , ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు.

జిల్లాలో బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం రూరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న ఆహ్లాదకర వాతావరణంలో మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) నిర్వహించాలని , ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో మెగా పీటీఎం నిర్వహించాలన్నారు. ముందుగా అందరికీ ఆహ్వాన పత్రికలు అందించాలని తెలిపారు. విద్యార్థులు యూనిఫాంతో హాజరవ్వాలని, వారితో పాటు తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని, ఉపాధ్యాయులతో ఫొటో సెషన్‌ నిర్వహించాలని వెల్లడించారు. మానసిక ఆరోగ్యం, సైబర్‌ క్రైం, మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం, డ్రగ్స్‌ అనర్థాలు, షైనింగ్‌ స్టార్స్‌, అత్యున్నత స్థాయికి చేరిన వారి స్ఫూర్తిదాయక సందేశాలను విద్యార్థులతో చెప్పించాలన్నారు.

బంగారు కుటుంబం మ్యాపింగ్‌లో జాగ్రత్తలు

బంగారు కుటుంబం మ్యాపింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ..‘ కొంతమంది మార్గదర్శకులు మొత్తం మండలాన్ని దత్తత తీసుకుంటున్నట్టు వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి జాగ్రత్తగా మ్యాపింగ్‌ చేయాలి. సూర్యఘర్‌ పథకం కింద జిల్లాలో 312 గృహాలకు కనెక్షన్లు ఇచ్చాం. ఎక్కువ సంఖ్యలో యూనిట్ల ఏర్పాటుకు కృషి చేయాలి. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన పెంపొందించాలి. వర్షాలు జోరుగా కురుస్తున్నందున కాలువల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. దోమల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.’ అని తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడమే లక్ష్యం

పార్వతీపురం, జూలై 7 (ఆంరఽధజ్యోతి): మన్యం జిల్లాకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ కేక్‌ కట్‌ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:01 AM