ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Are elections possible for 'Rajam'? ‘రాజాం’కు ఎన్నికలు సాధ్యమేనా?

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:40 AM

Are elections possible for 'Rajam'?

‘రాజాం’కు ఎన్నికలు

సాధ్యమేనా?

ఆర్థికసంఘం నిధుల నిలిపివేతతో ప్రభుత్వం దృష్టి

మునిసిపాల్టీలకు మరో ఏడు నెలల్లో ఎన్నికలు

వాటితో కలిపే నిర్వహించే అవకాశం

రాజాం, జూలై 27(ఆంధ్రజ్యోతి):

రాజాం మునిసిపాల్టీకి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమా చారం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో చాలా మునిసిపాల్టీలకు, నగరాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో అక్కడ పాలకవర్గాలు లేక పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. ముఖ్యంగా రాజ్యాంగపరంగా రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ప్రత్యేక నిధుల కేటాయింపు కూడా నిలిచిపోయింది. దీంతో అక్కడ సరైన అభివృద్ధి లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా రాజాం మునిసిపాల్టీకి సైతం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఇటీవల మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ సైతం దీనిపై ప్రకటన చేశారు. ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయిన దృష్ట్యా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మూడు నెలల్లో ఎన్నికలు పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రాజాం మునిసిపాల్టీకి ఎన్నికలు జరిగితే 20 ఏళ్ల తరువాత పాలకవర్గం వచ్చినట్టు అవుతుంది.

రాజాం ఎప్పటి నుంచి ఇలా..

రాజాం నగర పంచాయతీగా 2005లో రూపాంతరం చెందింది. అంతవరకు సారధి మేజర్‌ పంచాయతీలో భాగంగా ఉండేది. సారధిలో పొనుగటివలస, కొత్తవలస, కొండంపేటలను విలీనం చేస్తూ రాజాం నగర పంచాయతీని ఏర్పాటుచేశారు. అయితే న్యాయస్థానంలో కేసుల దృష్ట్యా ఎన్నికలు సాధ్యపడలేదు. రెండు దశాబ్దాలుగా పాలకవర్గాలు లేవు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రత్యేకాధికారుల ఏలుబడిలోనే కొనసాగుతోంది. ఆ మూడు పంచాయతీలకు సంబంధించి పాలకవర్గాలు ఉండగానే 2005లో ప్రత్యేక తీర్మానం చేసి నగర పంచాయతీలో విలీనం చేశారు. దీంతో ఆయా సర్పంచులు కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి కేసులు నడుస్తూ ఉన్నాయి. నాలుగేళ్ల కిందట వైసీపీ హయాంలోనే పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికల కోసం ప్రత్యేక తీర్మానాలు చేయించారు. ప్రత్యేకాధికారులను నియమించి ఆ తతంగం పూర్తిచేశారు. 2021లో మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్‌ చేసి ఎన్నికలకు సిద్ధపడ్డారు. మరోసారి పొనుగుటివలస, కొండంపేట, కొత్తపేట పంచాయతీలు విలీన ప్రక్రియతో ఉపాధి హామీ పథకం నిలిచిపోతుందని.. పన్నుల భారంతో సతమతమవుతామని చెప్పి మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. అయితే 20 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్‌ పడింది. ప్రత్యామ్నాయ రూపంలో నిధులు తెచ్చుకోవడం తప్ప.. నేరుగా వచ్చిన దాఖలాలు లేవు.

మిగతా వాటితో కలిపే ఎన్నికలు

రాజాం మునిసిపాల్టీకి ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశమే లేదన్న ప్రచారం నడుస్తోంది. రాజాం లాంటి పట్టణ స్థానిక సంస్థలు పెండింగ్‌లో 21 ఉన్నాయి. మిగతా పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 10తో ముగియనున్నాయి. అంటే కేవలం ఏడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే మిగతా మునిసిపాల్టీలతో కలిపి మాత్రమే రాజాం మునిసిపాల్టీకి ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అప్పటివరకూ వేచి చూడక తప్పదంటున్నారు. అయితే ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా పోయాయి. రెండు విడతల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. పట్టణ జనాభాకు అనుసరించి ఈ నిధులు విడుదల అవుతుంటాయి. ప్రజల మౌలిక వసతులకు సంబంధించి పారిశుధ్యం, తాగునీరు వంటి వాటికి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ పాలకవర్గం లేకపోవడంతో రాకుండా పోయాయి. దీంతో రాజాం మునిసిపాల్టీలో ఎక్కడివేసిన గొంగళి అక్కడ మాదిరిగా పరిస్థితి ఉండిపోయింది.

ఎటువంటి ఆదేశాలు లేవు

రాజాం మునిసిపాల్టీకి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ ఆర్థిక సంఘం నిధుల దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న మునిసిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాల్టీలకు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం 2026 మార్చి 10 వరకూ ఉంది.

- జాగరపు రామప్పలనాయుడు, కమిషనర్‌, రాజాం మునిసిపాల్టీ

Updated Date - Jul 28 , 2025 | 12:40 AM