Araku Coffee పార్వతీపురంలో అరకు కాఫీ
ABN, Publish Date - Apr 05 , 2025 | 11:53 PM
Araku Coffee in Parvathipuram జిల్లాకేంద్ర వాసులకు అరకు కాఫీ రుచి చూపిస్తామని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. త్వరలోనే పార్వతీపురంలో అవుట్‌లెట్‌ను పునఃప్రారంభిస్తామన్నారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ
బెలగాం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్ర వాసులకు అరకు కాఫీ రుచి చూపిస్తామని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. త్వరలోనే పార్వతీపురంలో అవుట్‌లెట్‌ను పునఃప్రారంభిస్తామన్నారు. శనివారం బెలగాంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద దుకాణాన్ని పరిశీలించారు. బెలగాంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద త్వరలో అరకు కాఫీ లే అవుట్‌ను పునఃప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ఇంఛార్జి పీవో ఆశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. పీవో శనివారం కాఫీ దుకాణాన్ని పరిశీలించారు. అరకు కాఫీకి మంచి ఆదరణ ఉందని, ఇటీవల పార్లమెంట్‌లో కూడా స్టాళ్లను ప్రారంభించారని చెప్పారు. గతంలో పార్వతీ పురంలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద అరకు కాఫీ విక్రయాలు జరిగేవని, అనివార్య కారణాల వల్ల అది మూతబడిందని వెల్లడించారు. జిల్లాకేంద్ర వాసులకు మళ్లీ అరకు కాఫీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవరసమైతే కాఫీ తయారీలో మంచి శిక్షణ అందించాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఐటీడీఏ ఏపీవో ఎ.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 11:53 PM