Another One Joins the Group గుంపులోకి మరొకటి
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:32 AM
Another One Joins the Group పార్వతీపురం డివిజన్‌లో గజరాజుల సంఖ్య పెరిగింది. ఆ గుంపులో మరొకటి చేరింది. సీతానగరం మండలం కోటసీతారాంపురంలో గత మూడు రోజులుగా ఎనిమిది ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ఆ ప్రాంతంలోని తోటల్లో ఓ ఏనుగు పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. దీంతో వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది.
తొమ్మిదికి చేరిన గజరాజుల సంఖ్య
సీతానగరం, జూన్11(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం డివిజన్‌లో గజరాజుల సంఖ్య పెరిగింది. ఆ గుంపులో మరొకటి చేరింది. సీతానగరం మండలం కోటసీతారాంపురంలో గత మూడు రోజులుగా ఎనిమిది ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ఆ ప్రాంతంలోని తోటల్లో ఓ ఏనుగు పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. దీంతో వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది. తల్లి ఏనుగు, గున్న ఏనుగు చుట్టూ మిగతా గజరాజులు కాసేపు రక్షణగా నిలిచాయి. కోటసీతారాంపురంలో హల్‌చల్ చేస్తున్న ఏనుగులు పొలాల్లోని వరి విత్తనాలు, మామిడి చెట్లను ధ్వంసం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు అవి ఎప్పుడు గ్రామాల్లోకి వస్తాయోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాలకొండ డివిజన్ భామిని మండలంలో మరో నాలుగు ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా జిల్లాలో వాటి సంఖ్య 13కు చేరింది.
Updated Date - Jun 12 , 2025 | 12:32 AM