Annadata Sukhibhava అన్నదాత సుఖీభవ ఈకేవైసీలో జిల్లాకు రెండో స్థానం
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:29 PM
Annadata Sukhibhava: District Secures Second Place in E-KYC అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులతో ఈకేవైసీ చేయించడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అర్హులుగా 1,18,274 మంది రైతులను గుర్తించారు. వారందరికీ ఈ నెల 20లోగా ఈకేవైసీ చేయించాలని ఆదేశాలున్నాయి. అయితే బుధవారం నాటికి 1,15,755 మంది రైతులతో ఈకేవైసీ చేయించారు.
సాలూరు రూరల్,జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులతో ఈకేవైసీ చేయించడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అర్హులుగా 1,18,274 మంది రైతులను గుర్తించారు. వారందరికీ ఈ నెల 20లోగా ఈకేవైసీ చేయించాలని ఆదేశాలున్నాయి. అయితే బుధవారం నాటికి 1,15,755 మంది రైతులతో ఈకేవైసీ చేయించారు. గడువు లోగా జిల్లాలో ఈ ప్రక్రియ 98 శాతం పూర్తికానుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్‌పాల్ తెలిపారు. కాగా ఈకేవైసీ పూర్తిలో విశాఖపట్నం అర్బన్ తొలిస్థానంలో నిలవగా.. మన్యం జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఈ నెల 21న తొలి విడత సాయం అందే అవకాశముంది. ప్రధానమంత్రి కిసాన్ సాయం రూ. 6వేలు కలుపుకుని అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.14 వేలు కూటమి ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. తొలి విడత సాయం కింద రూ.7 వేలు జమ చేయనున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని చెక్‌స్టేటస్‌లో ఆధార్ నెంబర్ నమోదు చేసి అర్హత పొందారో లేదో తెలుసుకోవచ్చు.
Updated Date - Jun 18 , 2025 | 11:29 PM