ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

An entrepreneur from every household ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్త

ABN, Publish Date - May 10 , 2025 | 11:55 PM

An entrepreneur from every household రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌

ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్త

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట

ఎంఎస్‌ఎంఈ పార్కుల ద్వారా ఉపాధి

కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్‌

రామభద్రపురం, మే 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కొట్టక్కి గ్రామం వద్ద రూ.7కోట్లతో మంజూరైన ఎంఎస్‌ఎంఈ పార్కుకు సంబంధించి శిలాఫలకాన్ని శనివారం ఆవిష్కరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ.లక్ష నుంచి రూ.50 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తున్నామని, ఔత్సాహికులైన యువత వినియోగించుకోవాలని కోరారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో 24 గంటల విద్యుత్‌, రోడ్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యంతోపాటు ట్రైనింగ్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు పార్కుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారని తెలిపారు. స్కిల్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ మంది పరిశ్రమల స్థాపనకు ముందకు వస్తున్నారని, దీనికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలే కారణమని అన్నారు. విజయనగరం పార్లమెంట్‌ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పరిశ్రమల్లో ఎంతో వెనుకబడి ఉన్నాయని, ఈ అపప్రదను తొలగించడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. బుడా చైర్మన్‌ తెంటు లక్ష్ముంనాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వలసలు నివారించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, జనసేన నాయకులు పాలూరి బాబు, బీజేపీ నాయకుడు మరిశర్ల రామారావు, జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, మర్రాపు సురేష్‌, టీడీపీ నాయకులు మడక తిరుపతిరావు, చింతల రామకృష్ణ, కర్రోతు తిరుపతిరావు, ముల్లు రాంబాబు, కరణం విజయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

కొండకిండాంలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన

బొండపల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయడంద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కొండకిండాం గ్రామంలో సుమారు 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.17.80 కోట్లతో సుమారు 25 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణావకాశమని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, కూటమి నాయకులు రెడ్డి పావని, ఎం.సురేష్‌, ముంజేటి పార్వతి, ఏపీఐఐసీ జెడ్‌ఎం మురళీమోహన్‌, ఆర్డీవో డి.కీర్తి, తహసీల్దార్‌ డి.రాజేశ్వరరావు, ఎంపీడీవో కే.తులసీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

--------------

Updated Date - May 10 , 2025 | 11:56 PM