Alluri: ‘అల్లూరి’ చిరస్మరణీయుడు
ABN, Publish Date - May 07 , 2025 | 11:55 PM
Alluri: The Immortal Hero మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయు డని ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతిని నిర్వహించారు.
పార్వతీపురం, మే 7 (ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయు డని ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పోరాటం ఎన్నటికీ మరువలేదని ఆమె అన్నారు. గిరిజనుల అణిచివేతను వ్యతిరేకించి.. విప్లవ జ్వాలను రగిలించిన మహా పోరాటయోథుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు ఆర్.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:55 PM