Gurukula Colleges గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు పిలుపు
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:13 PM
Admission Notification for Gurukula Colleges పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శోభిక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 18 లోగా టీడబ్ల్యుఆర్‌ఈఐఎస్‌సీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 29 (ఆంరఽధజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శోభిక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 18 లోగా టీడబ్ల్యుఆర్‌ఈఐఎస్‌సీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో అన్ని గ్రూప్‌లకు కలిపి 800 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పి.కోనవలస గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో (బాలికలు) ఎంపీసీ కోర్సుకు 40, బైపీసీ 40, సీఈసీ 40, ఏఅండ్‌టీ 20 సీట్లు కేటాయించా మన్నారు. కురుపాం (బాలికలు)లో ఎంపీసీ కోర్సుకు 40, బైపీసీ 40, సీఈసీ 40, పి.కోనవలస (బాలురు)లో ఎంపీసీ 40, బైపీసీ 40, హెచ్‌ఈసీ 40, ఏఅండ్‌టీ 20, భద్రగిరి (బాలికలు)లో ఎంపీసీ 40, బైపీసీ 40, హెచ్‌ఈసీ 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
- సీతంపేట రూరల్: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మూడు గిరిజనసంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీట్ల కేటాయింపు పదో తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుందన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:13 PM